Last Updated:

Pelli Kani Prasad Teaser: పెళ్లి కానీ ప్రభాస్ రిలీజ్ చేసిన పెళ్లి కానీ ప్రసాద్ టీజర్ చూశారా..?

Pelli Kani Prasad Teaser: పెళ్లి కానీ ప్రభాస్ రిలీజ్ చేసిన పెళ్లి కానీ ప్రసాద్ టీజర్ చూశారా..?

Pelli Kani Prasad Teaser: స్టార్ కమెడియన్ సప్తగిరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు కమెడియన్ గా ప్రతి సినిమాలో కనిపించిన సప్తగిరి ఆ తరువాత హీరోగా మారి పలు సినిమాల్లో నటించాడు. ఆ సినిమాలు విజయాన్ని అందుకోలేకపోవడంతో మళ్లీ కమెడియన్ గా మారి స్టార్ హీరోల సినిమాల్లో కనిపిస్తున్నాడు. ఇక తాజాగా చాలా గ్యాప్ తరువాత సప్తగిరి హీరోగా నటిస్తున్న చిత్రం పెళ్లి కానీ ప్రసాద్.

 

మల్లీశ్వరి సినిమాలో వెంకీమామ పేరు పెళ్లి కానీ ప్రసాద్. ఈ సినిమా తరువాత ఎవరికి పెళ్లి కాకపోయినా.. వారిని పేరుతో సంబంధం లేకుండా పెళ్లి కానీ ప్రసాద్ అని ఎగతాళి చేయడం అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు అదే పేరుతో సప్తగిరి రాబోతున్నాడు. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కెవై బాబు, భాను ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సప్తగిరి సరసన ప్రియాంక శర్మ నటిస్తుంది. ఇప్పటీజీకే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Nani: అష్టాచమ్మా టూ ప్యారడైజ్.. ఎలా ఉండేవాడు.. ఎలా మారాడు

ఇక తాజాగా పెళ్లి కానీ ప్రసాద్ టీజర్ ను  టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కట్నం లేకుండా పెళ్లి చేసుకోకూడదు అనే తండ్రి.. పెళ్లి కోసం ఆరాటపడే కొడుకు కథనే ఈ సినిమా అని తెలుస్తోంది.

 

” ప్రసాద్ అనే నేను.. కట్నం శాసనాల గ్రంధంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కు మర్యాద ఇస్తూ.. తరతరాలుగా కట్నం విషయంలో మా తాతముత్తత్తాలు ఫాలో అవుతున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ కు కట్టుబడి ఉంటాను అని ప్రమాణం చేస్తున్నాను” అంటూ సప్తగిరి డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది.

 

ప్రసాద్ కు ఏజ్ బారు అవుతున్నా పెళ్లి కాదు. ప్రసాద్ తండ్రి రూ. 2 కోట్లు కట్నం ఇచ్చే సంబంధం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఇంకోపక్క ప్రసాద్ పెళ్లి ఎప్పుడు అవుతుందో అని వేచి చూస్తూ ఉంటాడు. వీరిద్దరూ మధ్య జరిగే కథనే ఈ సినిమా. మరి చివరకు ప్రసాద్ కు పెళ్లి అవుతుందా..? కట్నం సంప్రదాయం వర్క్ అవుట్ అయ్యిందా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.  టీజర్ మొత్తం కామెడీ సీన్స్ తో నింపేశాడు డైరెక్టర్.

 

పెళ్లి కానీ ప్రసాద్ గా సప్తగిరి నవ్వులు పూయించాడు. ఆయన తండ్రిగా మురళీధర్ గౌడ్ అదరగొట్టేశాడు. ఇక శేఖర్ చంద్ర మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్ గా మారుతుంది. మార్చి 21 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సప్తగిరి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

ఇవి కూడా చదవండి: