Published On:

Ghaati Movie: ఎట్టకేలకు అనుష్క ‘ఘాటీ’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ – థియటర్లోకి వచ్చేది ఎప్పుడంటే..

Ghaati Movie: ఎట్టకేలకు అనుష్క ‘ఘాటీ’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ – థియటర్లోకి వచ్చేది ఎప్పుడంటే..

Anushka Ghaati Movie Release Date Announced: స్వీటీ అనుష్క శెట్టి వెండితెరపై కనిపించి రెండేళ్లు అవుతోంది. చివరి మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి చిత్రంలో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా తర్వాత అనుష్క ఘాటీ అనే మూవీలో నటిస్తోంది. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు ప్రొస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ని జరుపుకుంటుంది.

 

వేదం వంటి హిట్‌ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రమిది. దీంతో ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ మూవీ పలు కారణాల వాయిదా పడింది. ఏప్రిల్‌ 18న రిలీజ్‌ చేయాలని ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది. కానీ, వాయిదా పడింది. ఘాటీ రిలీజ్ డేట్‌ కోసం ఫ్యాన్స్‌ అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 11న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించింది.

 

ఈ మేరకు మూవీ టీం పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. అందులో అనుష్క, విక్రమ్‌ ప్రభు నదిలో సంచులు మోసుకుంటూ వెళుతున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై వంశీ కృష్ణారెడ్డి, రాజీవ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. నాగవెల్లి విద్యాసాగర్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో విడుదల కానుంది. టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ముఖ్యంగా అనుష్క లుక్‌ మూవీపై ఆసక్తిని పెంచింది.

 

ఇందులో ఆమె మాస్‌ అవతార్‌లో అలరించబోతోంది. చుట్టా కాలుస్తూ.. నేసిన కాటన్‌ చీర, కాలికి కడియంతో అనుష్క వైరేటీ లుక్‌లో కనిపించింది. ఇక టీజర్‌లో అనుష్క పాత్ర అందరిని సర్‌ప్రైజ్‌ చేసింది. ఓ సీన్‌లో ఆమె కత్తి ఓ వ్యక్తిని తలను కోస్తూ ఉగ్రరూపంలో ఆమెను చూసి అంతా షాక్‌ అయ్యారు. ఇంతకి అనుష్క పాత్ర ఏంటీ, క్రిష్‌ స్వీటీని ఎలా చూపించబోతున్నాడా? అని ఆసక్తి నెలకొంది. అయితే ఇందులో అనుష్క కొందరి చేతిలో మోసపోయిన మహిళగా కనిపించనుందట. వారిపై ప్రతీకారం తీర్చుకుంటూ అనాగారికి ప్రజలకు అండగా ఉంటుందనే టాక్‌ వినిపిస్తుంది. క్రైం, థ్రిల్లర్‌గా ఈ సినిమాను క్రిష్‌ రూపొందిస్తున్నారు.