Published On:

Allu Arvind: బ్యాంక్ స్కాం కేసులో అల్లు అరవింద్ విచారణ

Allu Arvind: బ్యాంక్ స్కాం కేసులో అల్లు అరవింద్ విచారణ

Bank Scam Case: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యుసర్ అల్లు అరవింద్ తాజాగా ఈడీ విచారణకు హజరైనట్టు తెలుస్తోంది. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్కాంక్ స్కాం కేసుకు సంబంధించి అరవింద్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాదాపు 3 గంటల పాటు ప్రశ్నించారని సమాచారం. 2018-19 మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీలపై అల్లు అరవింద్ ను ఈడీ అధికారులు వివరాలు అడిగినట్టు తెలుస్తోంది. వచ్చే వారం మరోసారి విచారణకు రావాలని అల్లు అరవింద్ కు అధికారులు ఆదేశాలు చేశారని టాక్.

 

కాగా రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థ.. యూనియన్ బ్యాంక్ నుంచి రూ. 101 కోట్లకు పైగా రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదని తెలుస్తోంది. దీంతో సీబీఐ కేసు నమోదు చేయగా.. కేసును ఈడీ విచారిస్తోంది. సంస్థ లావాదేవీలలో అవకతవకలు జరిగినట్టు సమాచారం. అందులో అల్లు అరవింద్ పేరు కూడా ఉండటంతో ఈడీ విచారణకు పిలిచిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే అసలు ఆ సంస్థతో కానీ, ఆ స్కాంతో కానీ అల్లు అరవింద్ కి సంబంధం ఉందా లేదా? అనేది తేలాల్సి ఉంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి: