Producer AM Ratnam: ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించిన ‘హరి హర వీరమల్లు’ నిర్మాత
Producer AM Ratnam Meets Film Chamber President Bharat: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘హరి హర వీరమల్లు’. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం అనేక వాయిదాల అనంతరం రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్లకు వస్తున్న తరుణంలో టాలీవుడ్ థియేటర్ల బంద్ వివాదం తెరపైకి వచ్చింది. పర్సంటేజీల విషయంలో సింగిల్ థియేటర్లకు అన్యాయం జరుగుతుందని, అవి తీర్చాలని రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ల యాజమాన్యాలు టాలీవుడ్ పెద్దలను కోరాయి.
లేని పక్షంలో తాము థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. అయితే అవి కేవలం ప్రచారనికి మిగిలాయి. థియేటర్ల బంద్ అనేది లేదని టాలీవుడ్ స్పష్టం చేసింది. కానీ, ఏపీ ప్రభుత్వం పట్ల సినిమా ఇండస్ట్రీ తీరుపై ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కూటమీ ప్రభుత్వం వచ్చాక ఎవరైన వచ్చి ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారా? అని ప్రశ్నించారు. ఇకపై సనిమా థియేటర్ల పెంపు సహా ఎలాంటి అంశంపైనా వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నిర్ణయంతో సినిమాటోగ్రఫీ మంత్రి నేరుగ కలిసే అవకాశం లేకుండ పోయింది. టికెట్ ధరలు పెంపుకు నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్ తరుపున ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా హరి హర వీరమల్లు డైరెక్టర్ ఏఎం రత్నం ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించారు. మరో పది రోజుల్లో విడుదల కావాల్సి ఉన్న తమ సినిమా హరి హర వీరమల్లు చిత్రానికి టికెట్ ధరల పెంపు, అదనపు, బెనిఫిట్ షో అనుమతి వంటి అంశాలపై తమ టీం తరపున ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేస్తూ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్‌కు ఒక లేఖ సమర్పించారు.
కాగా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. జూన్ 12న వరల్డ్ వైడ్ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో పవన్ పోరాట యోధుడిగా కనిపించనున్నాడు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి క్రష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా తొలి పార్ట్‌ను వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో విడుదల చేస్తున్నారు.