Employment Linked Incentive: యువతకు అదిరిపోయే స్కీమ్.. ఉచితంగా ఖాతాల్లోకి రూ.15,000 పొందాలంటే?

Employment Linked Incentive: కేంద్ర ప్రభుత్వం యువతకు అదిరిపోయే పథకం తీసుకొచ్చింది. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు పారిశ్రామికంగా ప్రోత్సాహం అందించేందుకు ఉపాధి ఆధారిత ప్రోత్సాహకం పథకాన్ని 2025 జులై 1న ప్రారంభించింది. ఈ పథకం కింద తొలిసారి ఉద్యోగంలో చేరే యువతకు రూ.15,000 ప్రోత్సాహకం అందించనుంది. ఈ మొత్తాన్ని వాయిదా రూపంలో రెండు సార్లు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది.
ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. EPFOలో తొలుత నమోదు చేసుకున్న ఉద్యోగులకు నెల వేతనం, గరిష్టంగా రూ. 15వేలు ప్రోత్సాహకంగా అందించనుంది. ఈ మొత్తాన్ని రెండు వాయిదాలలో జమ చేయనుంది. ఈ పథకం ప్రధాన లక్ష్యం పారిశ్రామిక రంగంలో ఉపాధి కల్పనను ప్రోత్సాహం. అలాగే కొత్త ఉద్యోగులను నియమించుకునే కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తుంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈ పథకం ద్వారా ఎక్కువ లబ్ధి చేకూరుతుంది. అంతేకాకుండా ఈ పథకం యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు నైపుణ్యాల అభివృద్ధి చేసుకునేందుకు వీలు ఉంటుంది.
ఈ EPFOలో నమోదు చేసుకున్న ఉద్యోగుల జీతం నెలకు రూ. 1 లక్ష లోపు ఉంటే అర్హులుగా గుర్తించనుంది. రూ.లక్షకు పైగా జీతం పొందే ఉద్యోగులు అనర్హులు. ఈ పథకం కింద రెండేళ్లలో దాదాపు 3.5 కోట్ల ఉద్యోగాలను చేర్చేలా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకంలో భాగంగా ఆధార్ బ్రిడ్జ్ పేమెంట్ సిస్టమ్ ఉపయోగించి డీబీటీ ద్వారా ప్రోత్సాహకం నేరుగా ఉద్యోగి బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ చేయనుంది.
అలాగే కొత్త ఉద్యోగులను నియమించుకునేందుకు కంపెనీలు ప్రోత్సాహకాలు పొందుతాయి. దీంతో ఎక్కువ మంది యువతకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. కనీసం 6 నెలల పాటు ఉద్యోగం చేస్తున్న ప్రతి ఉద్యోగికి ప్రభుత్వం 2 ఏళ్ల పాటు నెలకు రూ. వేల వరకు ప్రోత్సాహకాన్ని కంపెనీలకు అందిస్తుంది. ఈ పథకం కింద నగదు జమ చేసేందుకు బ్యాంక్ ఖాతాను పాన్ లింక్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.