Last Updated:

Horoscope Today: నేటి రాశిఫలాలు

వృత్తి ఉద్యోగాలలో వత్తిడి ఉంటుంది. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయం కలుగుతుంది. కుటుంబానికి సంబంధించి ముఖ్యమైన వార్త వింటారు.ఆరోగ్యం జాగ్రత్త.

Horoscope Today: నేటి రాశిఫలాలు

మేషం(అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి ఉద్యోగాలలో వత్తిడి ఉంటుంది. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయం కలుగుతుంది. కుటుంబానికి సంబంధించి ముఖ్యమైన వార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త.

వృషభం(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి ఉద్యోగాలలో వత్తిడి ఉన్నా అధికారులను మెప్పిస్తారు. వివాదాలకు దూరంగా ఉండాలి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబసభ్యులతో కలసి ఆనందంగా గడుపుతారు.

మిధునం (మృగశిర 3,4, ఆర్ర, పునర్వసు 1,2,3)
పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో సహనం అవసరం, నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

కర్కాటకం(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. ఆర్దిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. దూరప్రాంతాలనుంచి శుభ వార్త వింటారు.

సింహం(మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. కొత్తగా రుణాలు చేస్తారు. నిరుద్యోగులకు ఒక శుభవార్త అందుతుంది. వివాదాలాకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో
అప్రమత్తంగా ఉండాలి.

కన్య(ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.

తుల(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
బంధు, మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండాలి. వృత్తి ఉద్యోగాలలో వత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఎదురయినా అధిగమిస్తారు. ఆర్దిక విషయాలపట్ల అప్రమత్తంగా ఉండాలి. మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండాలి. కుటుంబసభ్యుల ఆరోగ్యవిషయాలపై శ్రద్ద చూపుతారు.

ధనస్సు(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగ, వ్యాపారాల్లో వత్తిడిని అధిగమించవలసి ఉంటుంది. దూరప్రాంతాలనుంచి ఒక శుభవార్త వింటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.

మకరం(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం 4, ధనిష్ట 2)
ఉద్యోగ, వ్యాపారాల్లో చికాకులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆర్దికపరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. సంతానానికి సంబంధించి ముఖ్యమైన వార్త వింటారు.

కుంభం(ధనిష్ట 3,4, శతభిషం 4, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరుగుతుంది. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండాలి. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.

మీనం(పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ పెరిగినా పనులు పూర్తి చేస్తారు. ఇంటికి సంబంధించి ముఖ్యమైన పనులను ప్రారంభిస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

follow us

సంబంధిత వార్తలు