Published On:

Horoscope for Monday, May 05, 2025: నేటి రాశి ఫలాలు.. జీవిత భాగస్వామి నుంచి ధన సహాయం!

Horoscope for Monday, May 05, 2025: నేటి రాశి ఫలాలు.. జీవిత భాగస్వామి నుంచి ధన సహాయం!

Horoscope for Monday, May 05, 2025: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.

మేషం: ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ముందుకు సాగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం వస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి కోసం శ్రమిస్తారు. ఇష్టదైవాన్ని పూజించాలి.

వృషభం: ఈ రాశి వారికి శుభకాలం. కొత్త ఉత్సాహంతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది. క్రయవిక్రయాలలో లాభాలు వస్తాయి. రుణాలు తీరుతాయి. లక్ష్మీదేవిని పూజించాలి.

మిథునం: ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. ఆర్థికపరమైన వ్యవహారాలు బాగానే ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

 

కర్కాటకం: ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. పెట్టుబడికి తగిన విధంగా లాభాలు గడిస్తారు. ఆరోగ్యం పై జాగ్రత్తలు తీసుకోవాలి. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి ధన సహాయం పొందుతారు. మహాలక్ష్మీ అష్టోత్తరం చదవాలి.

సింహం: ఈ రాశి వారికి అనుకూలం. సభలు సమావేశాలకు హాజరవుతారు. పుణ్యక్షేత్రాల సందర్శనతో మానసిక ఆనందం పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్త అవకాశాలు మీ చెంతకు వస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. వేంకటేశ్వరుడిని ఆరాధించాలి.

కన్య: ఈ రాశి వారికి శుభకాలం. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. హోదా పెరుగుతుంది. కీలక వ్యవహారాలలో విజయం పొందుతారు. వాహనాలు కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శివారాధన చేస్తే మంచిది.

 

తుల: ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. సంతానం, సాంకేతిక పరమైన విద్య అవకాశాలు పొందుతారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన ప్రయోజనాలు దక్కుతాయి. దైవారాధన మానవద్దు.

వృశ్చికం: ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. కీలక వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం పఠించాలి.

ధనున్సు: ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంతానం నుంచి కీలక సమాచారం అందుతుంది. పట్టుదలతో ముందుకు సాగుతారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. సమాజంలో మంచి పేరు ఉంటుంది. శివుడిని ఆరాధిస్తే మంచిది.

 

మకరం: ఈ రాశి వారికి అనుకూలం. దూరప్రాంతల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగ విషయాల్లో కఠినంగా ఉంటారు. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

కుంభం: ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యాసంస్థలు పోటీని, విమర్శలను ఎదుర్కొంటుంది. కాంట్రాక్టులు లైసెన్సులు లభిస్తాయి. పిల్లల విద్యా విషయమై ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనం: శుభకాలం. శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. సహుద్యోగులు మీ మీద చేస్తున్న దుష్ప్రచారాలు అబద్ధాలేనని నిరూపిస్తారు. ప్రభుత్వపరమైన పనులు అనుకూలిస్తాయి. లక్ష్మీ సహస్రనామ పారాయణ చేస్తే మంచిది.