#Jiodown: నిలిచిపోయిన జియో సేవలు.. ట్రెండ్ అవుతున్న #Jiodown హ్యాష్ ట్యాగ్
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో సేవలు మంగళవారం నిలిచిపోయాయి. జియో యూజర్లు కాలింగ్, మెసేజింగ్ వంటి పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై పలువురు యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. దానితో ప్రస్తుతం ట్విట్టర్‌లో #Jiodown హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది.
#Jiodown: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో సేవలు మంగళవారం నిలిచిపోయాయి. జియో యూజర్లు కాలింగ్, మెసేజింగ్ వంటి పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. సోమవారం రాత్రి నుంచే సేవలను నిలిచిపోయాయని పలువురు యూజర్లు అంటున్నారు. ఈ విషయంపై పలువురు యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు.
చాలా మంది వినియోగదారులు మొబైల్ ఇంటర్నెట్ సేవలను ఉపయోగించగలిగినా ఫోన్‌కాల్స్ చేయలేకపోయినట్లు తెలిపారు. ఓ యూజన్ తన మొబైల్‌లో సిగ్నల్ కనిపించడం లేదని, ఫోన్‌కాల్స్ చేయలేకపోయినట్లు ట్వీట్ చేశాడు. సాధారణ కాల్స్‌లో సమస్యలు ఉన్నప్పుడు 5జీ సేవలు ఎలా అందిస్తారంటూ కంపెనీని ప్రశ్నించాడు. మరొక వినియోగదారులు కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే తన ఫ్లైట్ మిస్సయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఎవరు పరిహారం చెల్లిస్తారంటూ ప్రశ్నించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ట్విట్టర్‌లో #Jiodown హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది. మరోవైపు జియో సర్వీసులు నిలిచిపోవడంపై నెట్టింట మీమ్స్ తెగ వైరల్‌గా మారాయి. అయితే, సర్వీసులు నిలిచిపోవడంపై రిలయన్స్ జియో ఇప్పటి వరకు స్పందించలేదు.
ఇదీ చదవండి: ఫేస్బుక్-ఇన్స్టాగ్రామ్ రీల్స్‌కు పోటీగా.. జియో నుంచి కొత్త యాప్