JIO Platform App: ఫేస్బుక్-ఇన్స్టాగ్రామ్ రీల్స్‌కు పోటీగా.. జియో నుంచి కొత్త యాప్
జియో ఫేస్బుక్- ఇన్స్టాగ్రామ్ రీల్స్‌కు పోటీగా సరికొత్త యాప్ తో వినియోదారులను ఆకర్షించేందుకు సన్నద్దమవుతుంది. "ప్లాట్‌ఫామ్" పేరుతో కొత్త యాప్‌ను తీసుకొచ్చేందుకు జియో ప్రణాళికలు చేస్తుంది.
JIO Platform App: జియో ఫేస్బుక్- ఇన్స్టాగ్రామ్ రీల్స్‌కు పోటీగా సరికొత్త యాప్ తో వినియోదారులను ఆకర్షించేందుకు సన్నద్దమవుతుంది. “ప్లాట్‌ఫామ్” పేరుతో కొత్త యాప్‌ను తీసుకొచ్చేందుకు జియో ప్రణాళికలు చేస్తుంది.
జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్, క్రియేటివ్‌ల్యాండ్ ఏషియా, రోలింగ్ స్టోన్స్ ఇండియా సంస్థలు సంయుక్తంగా ఈ షార్ట్ వీడియో యాప్‌ను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్‌ను కూడా విడుదల చేశాయి. ఎంటర్‌టైనర్స్‌ను గుర్తించి, మంచి వాతావరణంలో ఆర్గానిక్‌గా వృద్ధిచెందుతూ, నిలకడగా మోనెటైజేషన్ సాధించే లక్ష్యంతోనే ఈ యాప్‌ను తీసుకొస్తున్నట్టు ఆ ప్రకటనలో సంస్థలు వెల్లడించాయి. క్రియేటర్లు, సింగర్లు, యాక్టర్లు, మ్యుజీషియన్లు, డ్యాన్సర్లు, కమేడియన్లు, ఫ్యాషన్ డిజైనర్లతో పాటు ఇన్ఫ్లుయెంజర్లుగా మారాలనుకునే వారందరికి ఈ ప్లాట్‌ఫామ్ యాప్ ఓ మంచి వేదిక కానుందని జియో భావిస్తోంది.
ఈ యాప్‌ను బీటా వర్షెన్‌లో ఇప్పటికే టెస్ట్ చేస్తున్నట్టు నివేదికల సమాచారం. అన్ని అనుకున్నట్టు జరిగితే 2023 జనవరిలో జియో రీల్స్ ప్లాట్ ఫామ్ యాప్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కంటెంట్ క్రియేటర్ల గ్రోత్‌ను వాటి టాలెంట్ మరియు వ్యూవ్స్ ఆధారంగా నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది. సిల్వర్, బ్లూ, రెడ్ టిక్ వెరిఫికేషన్ల ద్వారా వారిని గుర్తిస్తారని సమాచారం. కంటెంట్, ఫ్యాన్‌బేస్ ఆధారంగా ఈ టిక్స్‌ను కేటాయిస్తారని తెలుస్తోంది. టెలికాం దిగ్గజమైన జియో మెటాకు పోటీగా నిలుస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి జియో ప్రవేశపెట్టే ఈ రీల్స్ యాప్‌ను ఏ మేరకు వినియోగదారులు ఆదరిస్తారో వేచి చూడాలి.
ఇదీ చదవండి: స్మార్ట్ ఫోన్ తయారీకి మస్క్ మొగ్గు.. యాపిల్, గూగుల్‌కు వార్నింగ్