Last Updated:

Congress Id Card For Megastar Chiranjeevi: చిరుకు కాంగ్రెస్ ఐడీ కార్డ్… రాజకీయ రీఎంట్రీ కోసమేనా..?

రాజకీయాలు నాకు దూరం కాదు అంటూ చిరంజీవి అటు అభిమానుల్లోనూ ఇటు రాజకీయనేతల్లోనూ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాడు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి కొత్త ఐడీ కార్డును జారీ చేసింది. పీసీసీ డెలిగేట్‌గా చిరును గుర్తిస్తూ ఈ కొత్తకార్డును ఇచ్చింది. ఈ కార్డుకి 2027 వరకు కాలపరిమితి వుంటుందని తెలిపింది. 

Congress Id Card For Megastar Chiranjeevi: చిరుకు కాంగ్రెస్ ఐడీ కార్డ్… రాజకీయ రీఎంట్రీ కోసమేనా..?

Congress Id Card For Megastar Chiranjeevi: రాజకీయాలు నాకు దూరం కాదు అంటూ చిరంజీవి అటు అభిమానుల్లోనూ ఇటు రాజకీయనేతల్లోనూ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాడు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి కొత్త ఐడీ కార్డును జారీ చేసింది. పీసీసీ డెలిగేట్‌గా చిరును గుర్తిస్తూ ఈ కొత్తకార్డును ఇచ్చింది. ఈ కార్డుకి 2027 వరకు కాలపరిమితి వుంటుందని తెలిపింది.

కాగా.. మంగళవారం నాడు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ ట్వీట్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అందులో ‘‘నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు’’ అని ఆడియో ఉంది.. అయితే ఈ డైలాగ్ చిరు ప్రజెంట్ చిత్రం గాడ్‌ ఫాదర్‌కు సంబంధించిందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏది ఏమైనా చిరంజీవి నోటి వెంట ఇలాంటి డైలాగ్ రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దానితో చిరు రాజకీయ ఎంట్రీపై మరోసారి అభిమానుల్లో చర్చ మొదలైంది. చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ.. పరోక్షంగా తన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు అంటున్నారు.

గతంలో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లో ప్రవేశించిన ఇచ్చిన చిరంజీవి.. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన విషయం విధితమే. కాగా యూపీఏ-2 హయాంలో మెగాస్టార్ చిరంజీవి కేంద్ర మంత్రిగా పనిచేసారు. మరీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ కార్డు జారీ చెయ్యడం వెనుక ఏవిధమైన “హస్త”వాటం ఉంటుందోనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: Yarlagadda Lakshmiprasad: ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా

ఇవి కూడా చదవండి: