Last Updated:

100 PFI Leaders Arrested by NIA: కొనసాగుతున్న ఎన్ఐఏ సోదాలు…100 మంది పీఎఫ్ఐ నేతలు అరెస్ట్

గత కొద్దికాలంగా తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్రవాద సంస్థలతో సంబంధం ఉందన్న సమాచారం మేరకు పీఎఫ్ఐకి చెందిన మొత్తం వంద మందికిపైగా నిందితులను అరెస్టు చేశారు.

100 PFI Leaders Arrested by NIA: కొనసాగుతున్న ఎన్ఐఏ సోదాలు…100 మంది పీఎఫ్ఐ నేతలు అరెస్ట్

100 PFI Leaders Arrested by NIA: గత కొద్దికాలంగా తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్రవాద సంస్థలతో సంబంధం ఉందన్న సమాచారం మేరకు పీఎఫ్ఐకి చెందిన మొత్తం వంద మందికిపైగా నిందితులను అరెస్టు చేశారు.

దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ ఈ దాడులను నిర్వహిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటకతోపాటు మొత్తం 13 రాష్ట్రాల్లోని
వంద స్థావరాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు జరిపిన ఎన్ఐఏ దాడుల్లో దాదాపు 100 మంది పీఎఫ్ఐకి చెందిన నిందితులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. దేశంలోని గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పీఎఫ్ఐ సంస్థ ఉగ్రవాదులకు సాయం అందిస్తుంది.
తీవ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడం, శిక్షణలో సాయం అందించడం, కరాటే శిక్షణ, అవేర్నెస్ ప్రోగ్రాంలు అంటూ అనుమానం రాకుండా తీవ్రవాద సంస్థల్లో సభ్యులను చేర్చడం వంటి కార్యకలాపాలను నిర్వహిస్తుంది. అరబ్ దేశాల్లో ఈ సంస్థ ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి నిధులు వసూలు చేసింది. ఈ నిధులను హవాలా మార్గంలో తరలించింది. బోగస్ బ్యాంక్ అకౌంట్లు ఏర్పాటు చేసి, అక్రమ లావాదేవీలకు పాల్పడిందని జాతీయ దర్యాప్తు సంస్థ నిర్దరించింది.

ఇకపోతే కేరళలోని మళప్పురం జిల్లా మంజేరిలోని పీఎఫ్ఐ పార్టీ ఛైర్మన్ ఒమా సలాం ఇంటితో సహా పలువురు కార్యకర్తల ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్ని కేంద్ర హోంశాఖ పర్యవేక్షిస్తోంది.

ఇదీ చదవండి: NIA Raids: లీగల్‌ అవేర్‌నెస్‌ ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలు… ఎన్ఐఏ సోదాలు

ఇవి కూడా చదవండి: