Trichy Airport: పురీషనాళం ద్వారా బంగారం స్మగ్గింగ్.. తిరుచురాపల్లి ఎయిర్ పోర్టులో పట్టుకున్న అధికారులు
ఇటీవల కాలంలో విదేశాల నుంచి దేశంలోకి బంగారం స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోతోంది. మన హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో తరచూ బంగారం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడుతున్న కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో దుబాయి నుంచి బంగారం కొనుగోలు చేసి ఇండియాకు అక్రమంగా రవాణా చేస్తున్నారు
Trichy Airport: ఇటీవల కాలంలో విదేశాల నుంచి దేశంలోకి బంగారం స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోతోంది. మన హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో తరచూ బంగారం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడుతున్న కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో దుబాయి నుంచి బంగారం కొనుగోలు చేసి ఇండియాకు అక్రమంగా రవాణా చేస్తున్నారు స్మగ్లర్లు. తాజాగా తమిళనాడులోని తిరుచురాపల్లి లో విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడి నుంచి 977 గ్రాముల 24 కేరట్ల బంగారం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దీని విలువ సుమారు రూ.70.58 లక్షల ఉంటుందని అధికారులు చెప్పారు.
దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో..(Trichy Airport)
అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే దుబాయి నుంచి ఎయిర్ ఇండియా విమానంలో తిరుచురాపల్లి వచ్చిన ప్రయాణికుడు 1081 గ్రాముల బంగారాన్ని తన పురీషనాళంలో పెట్టుకుని వచ్చాడు. అనుమానం వచ్చిన అధికారులు అతని పక్కకు పిలిపించి చెక్ చేస్తే అసలు బండారం బయటపడింది. వెంటనే అతన్ని అరెస్టు చేసి విచారణ మొదలుపెట్టారు. ఇటీవల కాలంలో తిరుచురాపల్లిలో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత నెలలో తిరుచిరాపల్లి ఎయిర్పోర్ట్లో అధికారులు 410 గ్రామల బంగారాన్ని పట్టుకున్నారు. దీని విలువ రూ.26.62 లక్షలు. కాగా ప్రయాణికులు సింగపూర్ నుంచి తిరుచురాపల్లి వచ్చాడు. అధికారులు సమాచారం ప్రకారం 330 గ్రాముల 24 కెరట్ల బంగారాన్ని, 80 గ్రాముల 22 కెరట్ల బంగారాన్ని ప్రయాణికుడు వెస్ట్ లేదా బనీయన్లో పేర్చి దాన్ని సీల్ చేసి సింగపూర్ నుంచి తిరుచురాపల్లి తీసుకువచ్చాడు. ఎట్టకేలకు అధికారులకు పట్టుబడి జైల్లో ఉచలు లెక్కబెడుతున్నాడు.