Israel War : ఇజ్రాయెల్ కు 100 మిలియన్ డాలర్లు సాయం – జో బైడెన్
హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ దాడులతో గాజా ప్రాంతమంతా ధ్వంసమైంది. అక్కడి పాలస్తీనా ప్రజల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది నిరాశ్రయులై ఆకలితో అలమటిస్తూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
Israel War : హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ దాడులతో గాజా ప్రాంతమంతా ధ్వంసమైంది. అక్కడి పాలస్తీనా ప్రజల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది నిరాశ్రయులై ఆకలితో అలమటిస్తూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గాజాకి అమెరికా మానవతా సాయం చేసేందుకు ముందుకొచ్చింది. 100 మిలియన్ డాలర్లు సాయం చేయనున్నట్లు జో బైడెన్ ప్రకటించారు.
ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్న సరిహద్దుల్ని ఆ దేశం మూసివేయగా.. రఫా బార్డర్ క్రాసింగ్ ద్వారా ఈజిప్ట్‌కు వెళ్లే దారిని పాలస్తీనా ప్రజలు ఎంచుకుంటున్నారు. దీంతో గాజా ప్రజలు తమ దేశంలోకి ప్రవేశించి స్థిరపడే అవకాశముందని, అలాగే ఉగ్రవాదులు తమ దేశంలోకి చొరబడే ప్రమాదముందని రఫా బార్డర్ క్రాసింగ్‌ను ఈజిప్ట్ మూసివేసింది. తాజాగా జో బైడెన్ జరిపిన చర్చలతో ఈజిప్ట్ ఈ మార్గాన్ని తెరిచేందుకు ఒప్పుకుంది. దీంతో అమెరికా మాత్రమే కాదు, అంతర్జాతీయ సంస్థలు గాజాకు సాయం చేయడానికి మార్గం లభించినట్లయింది.
ప్రస్తుతం టెల్ అవీవ్ పర్యటనలో ఉన్న బైడెన్.. నెతన్యాహుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఇజ్రాయెల్ కేబినెట్‌తో మాట్లాడా. ప్రాణాధార మానవతా సాయానికి ప్రభుత్వం అంగీకరించింది. ఒక వేళ హమాస్ వాటిని ఎత్తుకెళ్తే మళ్లీ సహాయం ఆగిపోతుంది. గాజా, వెస్ట్ బ్యాంకులకు అదనంగా 10 కోట్ల డాలర్లను సాయంగా అందిస్తాం’ అని బైడెన్ వివరించారు. యుద్ధం (Israel War) మరింత తీవ్రతరం కాకుండా.. మిడిల్‌ఈస్ట్ దేశాల్లో స్థిరత్వం, శాంతి నెలకొల్పడానికి కృషి చేయనున్నాయి. అమెరికా, ఈజిప్ట్ దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి ఇరుదేశాల అధినేతలు కట్టుబడి ఉన్నారు’’ అని ప్రకటనలో శ్వేతసౌధం పేర్కొంది.
ఈ నెల 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడిచేసిన వెంటనే ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్ధ విమానాలు, నౌకలను పంపింది. మంగళవారం మరిన్ని నౌకలను అక్కడికి తరలించింది. మొదట్లో ఒక విమానవాహక యుద్ధ నౌకను, దాని అనుబంధ నౌకలను పంపిన అమెరికా ఇప్పుడు మరో విమానవాహక నౌకాదళాన్ని పంపుతోంది. మెరైన్ సైనికులతో మూడు నౌకలు ఇజ్రాయెల్ తీరాన్ని చేరుకోబోతున్నాయి. పశ్చిమాసియాలోని పలు అమెరికా స్థావరాలకు యుద్ధవిమానాలను పంపింది. అమెరికా ప్రత్యేక పోరాట దళాలు ఇజ్రాయెల్‌తో కలసి వ్యూహరచన, గూఢచారి సమాచార మార్పిడి జరుపుతున్నాయి. మంగళవారంనాటికి అయిదు విడతలుగా అమెరికా ఆయుధాలు ఇజ్రాయెల్ కు చేరాయి.
రెండు దేశాల ఏర్పాటు పరిష్కారానికి అమెరికా కట్టుబడి ఉందని బైడెన్ తెలిపారు. ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజలు గౌరవంతో భద్రంగా నివశించాలన్నదే తమ అభిమతమని స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్, హమాస్ ఘర్షణ నేపథ్యంలో మానవతా కారిడార్‌ను ఏర్పాటు చేయాలన్న బ్రెజిల్ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి బుధవారం తిరస్కరించింది. 15 మంది సభ్యులు సమావేశమై ఈ తీర్మానంపై చర్చించి ఓటింగ్ జరిపారు. తీర్మానానికి అనుకూలంగా 12 ఓట్లు వచ్చాయి. అమెరికా వ్యతిరేకించింది. బ్రిటన్, రష్యా హాజరుకాలేదు. దీంతో తీర్మానం వీగిపోయింది. శాశ్వత సభ్య దేశాల్లో ఒక దేశం వ్యతిరేకించినా తీర్మానం వీగిపోతుంది.