Published On:

Union Cabinet Meeting: నేడు కేంద్ర కేబినెట్ మీటింగ్.. కీలక అంశాలపై చర్చ!

Union Cabinet Meeting: నేడు కేంద్ర కేబినెట్ మీటింగ్.. కీలక అంశాలపై చర్చ!

Union Cabinet Meeting Toady : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో నేడు కేంద్ర కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభయ్యే సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి తగు నిర్ణయాలు తీసుకుందని తెలుస్తోంది. సమావేశంలో జాతీయ, అంతర్జాతీయ అంశాలపై సమాలోచనలు జరుగుతాయని సమాచారం.

 

అలాగే దేశంలో పరిపాలన నిర్ణయాలు, అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్టు టాక్. ముఖ్యంగా దేశంలో తాజాగా ఉన్న సమస్యలు ఉగ్రవాదం అణచివేత, వాణిజ్యం, డిజిటల్ వసతుల కల్పన వంటి అంశాలపై మంత్రివర్గం మాట్లాడుకోనుంది. మరోవైపు అమెరికా విధిస్తున్న సుంకాలు, పాకిస్తాన్ అంశంతో పాటు, దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, వర్షాల నేపథ్యంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, పలు పథకాల అమలు సహా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునున్నట్టు సమచారం. కాజా తాజాగా జరుగుతున్న మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.