YSR statue : నిలదీసిన పవన్.. ఇప్పటంలో వైఎస్సార్ విగ్రహం తొలగింపు
గుంటూరు జిల్లా ఇప్పటంలో ఇళ్లు, మహనీయుల విగ్రహాల కూల్చివేతపై వివాదం రేగిన విషయం తెలిసిందే
Ippatam: గుంటూరు జిల్లా ఇప్పటంలో ఇళ్లు, మహనీయుల విగ్రహాల కూల్చివేతపై వివాదం రేగిన విషయం తెలిసిందే. రోడ్డు విస్తరణకోసమని మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధి విగ్రహాలను తొలగించిన అధికారులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించకుండా ముళ్లకంచె వేసిపోలీస్ రక్షణ ఏర్పాటుచేసారు. ఇప్పటం పర్యటన సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇదేంటని పోలీసులను, అధికారులను ప్రశ్నించారు.
గాంధీజీ వంటి మహనీయుల విగ్రహాలు తొలగించి వైఎస్సార్ విగ్రహాన్ని అలాగే వుంచడంపై ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో అధికారులు స్పందించారు.దీనితో సోమవారం వైఎస్ విగ్రహాన్ని తొలగించిన అధికారులు క్రేన్ సాయంతో తరలించారు. మరోవైపు ఇప్పటం ఇళ్ల కూల్చివేత ఫై ప్రతిపక్ష పార్టీలతో పాటు సామాన్య ప్రజలు సైతం ప్రభుత్వం ఫై ఆగ్రహం గా ఉన్నారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామానికి 120 ఫీట్ల రోడ్డు ఎందుకు అని ప్రశిస్తున్నారు. గుంతల రోడ్ల ను బాగుచేయని ప్రభుత్వం , ఉన్న రోడ్డును వెడల్పు చేస్తామనడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.