Last Updated:

Janasena Party Formation Day: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. ట్రెండింగ్‌లో కొత్త సాంగ్!

Janasena Party Formation Day: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. ట్రెండింగ్‌లో కొత్త సాంగ్!

JanaSena Party Formation Day New Song Viral: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాన్ 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటివరకు ఎంతో కష్టపడ్డాడు. ఈ సమయంలో ఎన్నో అవమానాలను సైతం ఎదుర్కొన్నారు. అయితే తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. తొలుత 2014లో పోటీ చేయకపోయిన టీడీపీ, బీజేపీకి మద్దతు తెలిపారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఘోరంగా ఓటమి చెందారు. కనీసం డిపాజిట్లు కూడా రాలేదు.

 

ఆ తర్వాత 2024 ఎన్నికల్లో మరోసారి టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ఊహించని విధంగా భారీ మెజార్టీ విజయం సాధించింది. పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ భారీ విజయం సాధించారు. దీంతో ఆయనకు డిప్యూటీ సీఎం వరించింది. తొలిసారి డిప్యూటీ సీఎం హోదాలో తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వస్తున్న నేపథ్యంలో వేడుకలను నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు.

 

పిఠాపురంలో మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లను సిద్ధమ చేశారు. మంత్రి, ఎంపీ, జిల్లా స్థాయి పోలీసుల పర్యవేక్షణలో పనులు వేగంగా జరుగుతున్నాయి. జనసైనికులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినందున మొదటిసారి జనసేన పార్టీ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించేందుకు సిద్దం చేశారు.

 

జనసేన పార్టీని ఆవిర్భవించి పదేళ్లు గడిచింది. ఈ సమయంలో పార్టీపై ఎన్నో సాంగ్స్ ఉండగా.. తాజాగా, మరో సాంగ్ విడుదల చేశారు. ‘జెండర.. జెండర.. జెండర.. సామాన్యుడికి అండగా.. పిడిగిలి బిగించి పట్టారా ఇది జనసేనాని జెండర..’ అంటూ సాగే ఈ సాంగ్ దుమ్ములేపుతోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో రూపొందించిన ఈ సాంగ్‌ను ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నాగబాబు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ‘జెండర.. జెండర.. జెండర..’ అంటూ సాగే ఈ సాంగ్‌ను దుంపటి శ్రీనివాస్ లిరిక్స్ రాగా.. సింధూ కే ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ సాంగ్ బాగుందని జనసైనికులు, వీర మహిళలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.