RBI Governor: రూపాయి క్షీణిత తక్కువే.. ఆర్ బి ఐ గవర్నర్ శక్తి కాంత దాస్
విదేశీ కరెన్సీలతో పోలిస్తే రూపాయి మారకపు విలువ క్షీణత తక్కువగానే ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్ధికపరమైన అంశాలపై వస్తున్న పలు విమర్శలపై ఆయన స్పందిస్తూ వ్యాఖ్యానించారు.
Mumbai: విదేశీ కరెన్సీలతో పోలిస్తే రూపాయి మారకపు విలువ క్షీణత తక్కువగానే ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్ధికపరమైన అంశాలపై వస్తున్న పలు విమర్శలపై ఆయన స్పందిస్తూ వ్యాఖ్యానించారు.
స్విస్ ఫ్రాంక్, సింగపూర్ డాలర్, రష్యా రూబుల్ వంటివి మినహా మిగతా అన్ని కరెన్సీలు మన దేశ రూపాయి కంటే ఎక్కవగా క్షీణించాయని ఆయన పేర్కొన్నారు. జపనీస్ యెన్ తో పోలిస్తే 12.4శాతం, చైనీస్ యువాత్ తో పోలిస్తే 5.9శాతం, పౌండ్ తో పోలిస్తే 4.6శాతం, యూరోతో పోలిస్తే 2.5శాతం చొప్పున రూపాయి బలపడిందని తెలిపారు.
మరోవైపు ఉక్రెయిన్-రష్యా యుద్దంతో ఆర్ధిక అంచనాలు తలకిందులైనాయన్నారు. కరోనా సమయంలో పరపతి విధానంలో ఉన్న సౌలభ్యంతో ఆర్ధిక స్ధిరత్వాన్ని కొనసాగించగలిగామన్నారు. అప్పట్లో క్షీణించిన జీడీపి అనంతరం పుంజుకుందన్నారు. 23-24లోనూ రాణిస్తామనుకొనే సమయంలో యుద్దంతో అంచనాలు తప్పుతున్నాయన్నారు.
ఇది కూడా చదవండి: GST collection: దేశ వ్యాప్తంగా భారీగా జీఎస్టీ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ దూకుడు