RBI Key Decisions: ఈఎంఐ కడుతున్నారా? వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం
RBI Monetary Policy Meeting Decisions: ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లు తగ్గిస్తూ లోన్లు తీసుకున్న వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. రెపోరేటును 2 5 బేసిస్ పాయింట్ల మేర కత్తిరిస్తూ నిర్ణయం తీసుకుంది. 6.50 నుంచి 6.25 శాతానికి తగ్గించింది. 2024 ఫిబ్రవరి 8 నుంచి వడ్డీరేట్లు 6.50శాతం వద్దే గరిష్టంగా కొనసాగుతోంది. అయితే, తాజాగా, ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించింది.
సుమారు ఐదేళ్ల తర్వాత రెపోరేటు 6.25 శాతానికి తగ్గడం విశేషం. దీంతో రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. అలాగే వడ్డీ రేట్లను సవరించడం గత రెండేళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కాగా, శుక్రవారం ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన మొదటి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్‌లో సంజయ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ నిర్ణయంతో బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. అయితే, ప్రధానంగా హోమ్ లోన్స్ తీసుకొని కడుతున్న వారికి వడ్డీ భారం తగ్గడంతో పాటు నెలవారీ ఈఎంఐలు కట్టేవారికి సైతం వడ్డీ భారం తగ్గనుంది. వడ్డీ రేట్లను తగ్గించడంతో ద్రవ్యోల్భణం కుదుటపడుతోందని మల్హోత్ర తెలిపారు. అలాగే మధ్య తరగతి ప్రజల చేతుల్లో డబ్బులు మిగలనున్నాయి. దీంతో మార్కెట్లో ప్రజలు కొనుగోలు చేసే అవకాశం ఉండడంతో వినియోగం పెరిగి ఆర్థికవ్యవస్థ మెరుగుపడనుంది.
మరో వైపు, ప్రజలు మార్కెట్‌లో కొనుగోళ్లు చేసే అవకాశం పెరగనుండడంతో వస్తువుల ధరలు సైతం పెరిగే అవకాశం ఉంది. దీంతో ద్రవ్యోల్భణానికి దారితీసే ప్రమాదం సైతం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో రెపోరేటు విషయంలో ఆర్బీఐపైనే భారం పడనుంది.
ఇదిలా ఉండగా, ఆర్బీఐ చివరిసారిగా 2020 మేలో వడ్డీ రేట్లను తగ్గించింది. కోవిడ్ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగు పర్చేందుకు ఆర్బీఐ రెపోరేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే.