Published On:

Niharika NM in Puri Movie: పూరి సినిమాలో ఛాన్స్ పట్టేసిన ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక NM?

Niharika NM in Puri Movie: పూరి సినిమాలో ఛాన్స్ పట్టేసిన ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక NM?

Niharika NM got a chance in Puri – Vijay Setupathi Movie: డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం పూరీ సేతుపతి. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ సినిమాను పూరీ ఛార్మీ కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో టాలెంటెడ్ బ్యూటీ టబు కీలక పాత్రలో నటిస్తుంది. ఆమె మాత్రమే కాకుండా కన్నడ నటుడు దునియా విజయ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక వీరితో పాటు బాలీవుడ్ హాట్ బ్యూటీ రాధిక ఆఫ్టే కూడా నటిస్తుందని వార్తలు వినిపించాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.

 

ఇకపోతే ఈ సినిమాలో మరో కుర్ర హీరోయిన్ కూడా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక NM గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కంటెంట్ క్రియేటర్ గా ఆమె వీడియోస్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈ చిన్నది హీరోయిన్ గా మారింది. ఇప్పటికే తెలుగులో ఒక సినిమాను అధికారికంగా అనౌన్స్ కూడా చేసింది. ఆ సినిమా ఇంకా సెట్స్ మీదనే ఉండగా.. తమిళ్ లో అమ్మడు నటించిన పెరుసు సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

 

వైభవ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నిహారిక హీరోయిన్ గా నటించింది. కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉండడంతో ఈ సినిమాపై ట్రోల్స్ కూడా నడిచాయి. ఇక హీరోయిన్ గా నిహారికకు మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా చూసాకానే పూరీ.. నిహారికను పిలిచి ఆడిషన్ చేయడం, ఆ పాత్రకు ఆమె పర్ఫెక్ట్ గా సరిపోతుందని ఓకే చేయడం కూడా జరిగిందట. త్వరలోనే నిహారికను సినిమాలోకి అధికారికంగా ఆహ్వానించనున్నారట. ఇప్పుడు టాలీవుడ్ లో ఏలుతున్న సగం మంది స్టార్ హీరోయిన్స్ అందరూ పూరీ పరిచయం చేసినవారే. మరి నిహారిక కూడా అలానే తెలుగులో పాతుకుపోతుందేమో చూడాలి.