IND vs PAK: ఉత్కంఠ పోరులో.. ఆఖరి బంతికి భారత్ ఘన విజయం
దాయాదీ దేశంతో జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. ఆఖరి ఓవర్ ఓవర్ లో ఆఖరి బంతి వరకు ఎవరు గెలుస్తారా అని సాగిన ఉత్కంఠ పోటీలో ఎట్టకేలకు విజయం టీం ఇంటియా సొంతం అయ్యింది.
IND vs PAK: దాయాదీ దేశంతో జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. ఆఖరి ఓవర్ ఓవర్ లో ఆఖరి బంతి వరకు ఎవరు గెలుస్తారా అని సాగిన ఉత్కంఠ పోటీలో ఎట్టకేలకు విజయం టీం ఇంటియా సొంతం అయ్యింది.
గతేడాది ప్రపంచ కప్ టోర్నీలో జరిగిన పరాజయానికి భారత్ జట్టు నేడు మ్యాచ్ గెలిచి బదులు తీర్చుకుందని చెప్పవచ్చు. మొదట టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ చేసి పాకిస్థాన్ జట్టుకు ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ నిర్ణత ఓవర్లలో 159 పరుగులను మాత్రమే ఇచ్చింది. అనంతరం 160 పరుగుల లక్ష ఛేదనలో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు కె ఎల్ రాహులు రోహిత్ శర్మ అంతగా రాణించలేకపోయారు. రోహిత్ (4), రాహుల్ (4), సూర్యకుమార్ యాదవ్ (15), అక్షర్ పటేల్ (2) వచ్చిన వారు వచ్చినట్లే పెవిలియన్ చేరారు.
ఇలాంటి సమయంలో పిచ్ పై నిలబడ్డ విరాట్ కోహ్లీ (82 నాటౌట్), హార్దిక్ పాండ్యా (40) అండతో అద్భుతంగా పోరాడాడు. చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా తొలి బంతికే పాండ్యా అవుటయ్యాడు. ఆ తర్వాత సింగిల్, డబుల్ వచ్చాయి. ఆ మరుసటి బంతికి కోహ్లీ సిక్సర్ బాదగా.. అది నోబాల్. ఫ్రీ హిట్ డెలివరీ వైడ్ అయింది. దీంతో మరో బంతి వేశారు. దీనికి మూడు రన్స్ వచ్చాయి. ఆ తర్వాత రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరం అయ్యాయి. ఈ సమయంలో దినేష్ కార్తీక్ స్టంప్ అవుట్ అయ్యాడు. గెలుపు ఓటముల మధ్య ఒక్క బాల్ ఒక్క రన్ ఉండగా అప్పుడే బ్యాటింగ్ కు వచ్చిన అశ్విన్ సింగిల్ తీసి జట్టుకు విజయం అందించాడు.
ఇదీ చదవండి: స్లో ఓవర్ రేటుకు చెక్.. ఆసిస్ ఐడియా అదిరింది..!