Last Updated:

David Warner: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్.. పోస్టర్ అదిరింది

David Warner: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్.. పోస్టర్ అదిరింది

David Warner: సినిమాలో నటించాలని ఎవరికి ఉండదు చెప్పండి.  ఎవరైనా తమను తాము వెండితెరపై చూసుకోవాలని కోరుకుంటారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా అలానే అనుకున్నాడు.  మొదటి నుంచి  క్రికెట్ అభిమానులకు డేవిడ్ అంటే ఎంతో అభిమానం. పుష్ప రీల్స్ తో ఆయన మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు.

 

తాను ఒక్కడే కాకుండా కుటుంబంతో కలిసి మరీ పుష్ప సినిమాలోని రీల్స్, సాంగ్స్ చేసి ప్రేక్షకులను విశేషంగా మెప్పించాడు. ఫ్యాన్స్ మాత్రమే కాదు అల్లు అర్జున్ కూడా వార్నర్ రీల్స్ కు ఫిదా అయ్యాడు. ఈ వీడియోలు చూసిన అభిమానులు టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చేయ్ వార్నర్ అన్నా అంటూ కామెంట్ పెట్టారు. ఇక ఇప్పుడు వార్నర్ వారు చెప్పిందే నిజం చేస్తున్నాడు. అవును.. డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

 

యంగ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాబిన్ హుడ్. మార్చి  28 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. వరుస ప్రెస్  మీట్లు, ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు.

 

ఇక ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ లో నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. ఇక తాజాగా నేది డేవిడ్ వార్నర్ పోస్టర్స్ ను రిలీజ్ చేసి ఆఫీషియల్ గా సినిమాలోకి వెల్ కమ్ చెప్పారు. ” ఫ్రమ్ బౌండరీ టూ బాక్సాఫీస్.. తెలుగు సినిమాకు స్వాగతం డేవిడ్ వార్నర్” అంటూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.

 

ఇక ఈ పోస్టర్స్ చూసిన అభిమానులు.. అన్న తెలుగు సినిమా పై వేట మొదలుపెట్టాడు. ఇప్పుడు కేవలం గెస్ట్ రోల్ మాత్రమే.. ముందు ముందు హీరోగా కూడా ఎంట్రీ ఇస్తాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి వార్నర్ క్యామియో రాబిన్  హుడ్ సినిమా సక్సెస్ కు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి: