The Paradise: ఇది కడుపుమండిన కాకుల కథ.. నాని సినిమాలో ఈ రేంజ్ బూతులా?

The Paradise: న్యాచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక తాజాగా నాని నటిస్తున్న చిత్రాల్లో ది ప్యారడైజ్ ఒకటి. దసరాతో మంచి హిట్ కాంబో అనిపించుకున్న నాని- శ్రీకాంత్ ఓదెల నుంచి వస్తున్న రెండో చిత్రమే ది ప్యారడైజ్.
SLV బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో మరాఠీ భామ సోనాలి కులకర్ణి ఒక ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రా స్టేట్మెంట్ అంటూ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.
టీజర్ ఆద్యంతం ఆకట్టుకోవడమే కాదు. అసలు ఇది నాని సినిమానా అని ఫ్యాన్స్ షాక్ అవ్వడం ఖాయం. దసరా సినిమాలో నానిని చూసే వామ్మో ఇదేంటి ఇంత వైలెంట్ గా ఉన్నాడు అనుకుంటే.. ఇందులో అంతకుమించి వైలెంట్ గా కనిపించాడు.
” చరిత్రలో అందరూ.. చిలకలు, పావురాలు గురించి రాసిండ్రుగానీ.. గదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలేదు” అంటూ ఒక పవర్ ఫుల్ లేడీ వాయిస్ తో గ్లింప్స్ మొదలైంది. ఈ సినిమా మొత్తం కాకుల జాతికి సంబంధించింది అన్నట్లు ఆ లేడీ చెప్పుకొచ్చింది. ఆ కాకుల జాతికి నాయకుడిగా నాని కనిపించాడు. తన కొడుకు గురించి అతడి సత్తా గురించి ఆమె ఎంతో పచ్చిగా చెప్పుకొచ్చిన విధానాన్ని బట్టే నాని ఏ రేంజ్ లో వైలెంట్ గా కనిపిస్తున్నాడో తెలిసిపోతుంది.
గ్లింప్స్ మొత్తం బూతులతో, రక్తంతో నింపేశారు.ముఖ్యంగా తన కొడుకును ఒక తల్లి.. లం**కొడుకు అని చెప్పడం నిజంగా రా స్టేట్మెంట్ అనే చెప్పాలి. చివర్లో నాని లుక్ చాలా వైలెంట్ గా కనిపించింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. అనిరుథ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. మరో కెజిఎఫ్ ను తలపించింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి ఈ సినిమాతో ఈ దసరా కాంబో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.