Published On:

Lavanya Tripathi: బేబీ బంప్‌తో మెగా కోడలు లావణ్య త్రిపాఠి – మాల్దీవుల్లో మెగా కపుల్‌ సందడి చూశారా!

Lavanya Tripathi: బేబీ బంప్‌తో మెగా కోడలు లావణ్య త్రిపాఠి – మాల్దీవుల్లో మెగా కపుల్‌ సందడి చూశారా!

Lavanya Tripati Baby Bump Photo Goes Viral: ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి వెకేషన్‌లో మోడ్‌లో ఉన్నారు. త్వరలోనే ఈ మెగా కపుల్‌ తల్లిదండ్రులు ప్రమోట్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లావణ్య గర్భవతిగా ఉంది. అయితే ప్రగ్నెన్సీ అనౌన్స్‌మెంట్‌ తర్వాత ఆమె మీడియాకు కెమెరాలను దాటేస్తున్నారు. తల్లికాబోతున్నట్టు ప్రకటించిన తర్వాత లావణ్య తన ఫస్ట్‌ బేబీ బంప్‌ ఫోటోలను షేర్‌ చేసింది. వరుణ్‌ తేజ్‌కు షూటింగ్‌ విరామం దొరకడంతో భార్య లావణ్యతో కలిసి విదేశీ టూర్‌కి వెళ్లాడు. ప్రస్తుతం మెగా జంట మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు.

 

వెకేషన్‌కి సంబంధించిన ఫోటోలు తాజాగా లావణ్య షేర్‌. అక్కడప్రకృతిని ఆస్వాదిస్తూ బీచ్‌ని ఎంజాయ్‌ చేస్తూ చాలా కూల్‌గా కనిపించారు. ఇద్దరు వైట్‌ అండ్‌ వైట్‌లో చెట్టు పక్కన ఇరువైపు నిలుచుని కనిపించారు. ఇందులో లావణ్య బేబీ బంప్‌తో కనిపించింది. ప్రస్తుతం ఆమె ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ప్రెగ్నెన్సీ ప్రకటన తర్వాత ఆమె షేర్‌ చేసిన తొలిఫోటో ఇది. ఇందులో ఆమె బేబీ బంప్‌తో కనిపించడంతో ఫ్యాన్స్‌, మెగా అభిమానులంత సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. వావ్‌ క్యూట్‌ మామ్‌ అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

 

కాగా లావణ్య త్రిపాఠి, వరుణ్‌లు ‘మిస్టర్‌’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో కలిసి నటించారు. అదే టైంలో ప్రేమలో పడ్డ వీరు ఆరేళ్ల పాటు సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్నారు. వీరిద్దరు ప్రేమ వ్యవహరంపై ఎన్నోసార్లు వార్తలు వచ్చినా.. వాటిని కొట్టిపారేశారు. ఇక ఫైనల్‌గా అవే వార్తలను నిజం చేస్తూ వీరిద్దరు పెళ్లికి రెడీ అయ్యారు. ఇరుకుటుంబాల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ తీసుకుని.. 2023 నవంబర్‌ 1న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలో వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవం జరిగింది.

 

మెగా, అల్లు కుటుంబంతో పాటు లావణ్య త్రిపాఠి కుటుంబం, కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితుల మధ్య గ్రాండ్‌ వెడ్డింగ్‌ జరిగింది. ఇక పెళ్లి తర్వాత కాస్తా నటనకు దూరంగా ఉన్న లావణ్య ఇటీవల సతీలీలావతి మూవీ ప్రకటించింది. ఈ సినిమా ప్రకటించిన కొన్ని రోజులకే గుడ్‌న్యూస్‌ షేర్‌ చేశారు. పెళ్లయిన రెండేళ్లకు వరుణ్‌-లావణ్య తల్లిదండ్రులు ప్రమోట్‌ కాబోతుండటంతో ఈ జంట మెగా అభిమానులు, ఇండస్ట్రీలో వర్గాల నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇక మెగా ఇంట్లో మరో వారసులు ఎప్పుడెప్పుడు వస్తారా.. కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.