AS Ravikumar Chowdary: సినీ పరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ డైరెక్టర్ మృతి
Tollywood Director AS Ravikumar Chowdary Passes Away: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు ఏ.ఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూశారు. రాత్రి గుండెపోటుకు గురికావడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయన కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నారు.
ఇటీవల ఆయన తీసిన మూవీ తిరగబడరా సామీ సక్సెస్ కాలేదు. దీంతో మరింత ఆలోచనలో పడ్డట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీలో రాజ్ తరుణ్ హీరోగా నటించారు. ఆయన మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. చౌదరి మృతి విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఇదిలా ఉండగా, ఏ.ఎస్ రవికుమార్ యజ్ఞం మూవీతో సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో బాలకృష్ణతో వీరభద్ర సినిమా చేశాడు. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్‌తో పిల్ల నువ్వు లేని జీవితం తెరకెక్కించాడు. ఈ సినిమా చౌదరితో పాటు సాయి ధరమ్ తేజ్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే ఆటాడిస్తా, ఏం పిల్లో ఏం పిల్లడో వంటి సినిమాలు తీశారు. కాగా, రవికుమార్ చౌదరి సూటిగా మాట్లాడుతాడని సన్నిహితులు చెబుతున్నారు.