Last Updated:

Lava Blaze Duo 5G Launch Date: బడ్జెట్ రెండు స్క్రీన్ల ఫోన్.. లావా ఇచ్చిపడేసింది.. హైలెట్ ఫీచర్ ఇదే..!

Lava Blaze Duo 5G Launch Date: బడ్జెట్ రెండు స్క్రీన్ల ఫోన్.. లావా ఇచ్చిపడేసింది.. హైలెట్  ఫీచర్ ఇదే..!

Lava Blaze Duo 5G Launch Date: తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త ఉంది. దేశీయ మొబైల్ మేకర్ లావా అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. లావా బ్లేజ్ ఎక్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ మొబైల్‌లో సూపర్ ఫీచర్లను అందించారు. ఇంతకీ ఈ ఫోన్ ఎంత? దాని ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

Lava డిసెంబర్ 16న Blaze Duo 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు ధృవీకరించింది. ఇది సెకండరీ AMOLED రియర్ డిస్‌ప్లేతో కూడిన డ్యూయల్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. దీనితో పాటు ఈ ఫోన్ ధర సుమారు రూ. 20,000  ఉంటుందని పేర్కొంది. ఇది ఈ విభాగంలో మొదటి స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది.

Lava Blaze Duo 5G Specifications
ఈ స్మార్ట్‌ఫోన్ 1.58-అంగుళాల సెకండరీ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది అగ్ని 3 5Gలోని 1.74-అంగుళాల కంటే కొంచెం చిన్నది. ఇది కాల్‌లను రిసీవ్ చేసుకోవడానికి, నోటిఫికేషన్‌లను చూడటానికి, మ్యూజిక్ ప్లేయర్ వంటి మల్టీ యాప్‌లను ఉపయోగించడానికి యాక్సెస్ ఇస్తుంది.

Lava Blaze Duo 6.67-అంగుళాల 120Hz 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది MediaTek డైమెన్సిటీ 7025 SoCని కలిగి ఉంటుంది, 6GB/8GB LPDDR5 RAM, 128GB UFS 3.1 స్టోరేజ్‌తో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో వస్తుంది.అలానే 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ బ్యాకప్ ఆఫర్ చేస్తుంది.

కెమెరా గురించి మాట్లాడితే ఈ ఫోన్‌లో 64MP బ్యాక్ కెమెరా, సోనీ సెన్సార్‌తో కూడిన సెకండరీ కెమెరా ఉంటుంది. అయితే ఇది సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. హ్యాండ్‌సెట్ ఎటువంటి బ్లోట్‌వేర్ లేకుండా Android 14లో పని చేస్తుంది. అలానే త్వరలో Android 15 అప్‌డేట్ పొందుతుందని కంపెనీ తెలిపింది.

సెలెస్టియల్ బ్లూ, ఆర్కిటిక్ వైట్ కలర్స్‌లో ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ డిజైన్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ వస్తుందని లావా వెల్లడించింది. Lava Blaze Duo 5G వచ్చే వారం లాంచ్ అయిన తర్వాత Amazon.inలో సేల్‌కి అందుబాటులో ఉంటుంది. దీని కచ్చితమైన ధర లాంచ్ రోజునే తెలుస్తుంది.