Last Updated:

KKR IPL 2025 : కేకేఆర్ కెప్టెన్‌గా అజింక్య రహానే.. కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ ప్రకటన

KKR IPL 2025 : కేకేఆర్ కెప్టెన్‌గా అజింక్య రహానే.. కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ ప్రకటన

KKR IPL 2025 : మరో 18 రోజుల్లో ఐపీఎల్ 18వ సీజన్ (ఐపీఎల్ 2025) టోర్నీ ప్రారంభం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన రెండు వారాల్లో క్రికెట్ అభిమానులను సందడి చేయనుంది. కొత్త సీజన్‌కు నూతన జెర్సీతో సిద్దమవుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ తాజాగా కెప్టెన్‌ను ప్రకటించింది. అజింక్య రహానేకు జట్టు పగ్గాలు అప్పగించింది. యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. సోమవారం తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ప్రకటించింది.

గత సీజన్‌లో ఐపీఎల్ టైటిల్‌ను అందించిన శ్రేయస్ అయ్యర్‌ను మేనేజ్‌మెంట్ ఈసారి తీసుకోలేదు. మెగా వేలంలోనూ కూడా తీసుకోలేదు. యువ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్‌కు భారీ మొత్తం వెచ్చించింది. అనూహ్యంగా వెటరన్ ఆటగాడు అజింక్యను తీసుకుంది. వీరిద్దరిలోనూ ఒకరికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని ముందు నుంచి ప్రచారం జరిగింది. అంచనాలకు అనుగుణంగా సీనియర్ వైపు యాజమాన్యం మొగ్గుచూపింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మినహా మిగతా అన్ని జట్లకు కెప్టెన్ ఎవరనేది తేలిపోయింది. ఢిల్లీ మాత్రం కేఎల్ రాహుల్ లేదా అక్షర్ పటేల్‌లో ఒకరికి కెప్టెన్‌గా పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి.

2025 సీజన్ కోసం జట్టు నూతన జెర్సీని కోల్‌కతా సోమవారం ఆవిష్కరించింది. జెర్సీపై మూడు స్టార్లకు చోటు కల్పించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రత్యేక వీడియోను పోస్టు చేసింది. జెర్సీపై తాము మూడు స్టార్లకు స్థానం కల్పించామని కోల్‌కతా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ బిందా దే వెల్లడించారు. తాము మూడు టైటిళ్లను సొంతం చేసుకున్నామని చెప్పారు. మిథన రాశి రోజునే ఇవన్నీ జరిగాయని పేర్కొన్నారు. ఈసారి కూడా అదే ఉత్సాహం ప్రదర్శిస్తామన్నారు. మూడు టైటిళ్లకు కర్బో, లోర్బో, జీత్బో అని నామకరణం చేసినట్లు చెప్పారు. బెంగాలీ పదాలైన వీటికి ప్రదర్శన, పోరాటం, గెలుపు అని అర్థం అని పేర్కొన్నారు. ఇది కేవలం తమ ఉద్దేశం కాకుండా.. ఛాంపియన్ వారసత్వాన్ని కొనసాగించేందుకు స్ఫూర్తిగా నిలుస్తాయని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: