ENG vs IND : ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్.. టీమ్‌ఇండియాకు కొత్త కోచ్.. ఎవరంటే?

England vs India : భారత జట్టు ఇంగ్లాండ్ టూర్ వెళ్లింది. త్వరలో ఐదు టెస్టులు ఆడనుంది. టీంమిండియాకు ఇది కీలమైన సిరీస్. సిరీస్‌తోనే డబ్ల్యూటీసీ 2025-2027 ప్రారంభం కానుంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ టెస్టులకు గుడ్‌బాయ్ చెప్పడంతో భారత జట్లు కాస్త డీలా పడింది. సీనియర్లు టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించడంతో జట్టులోకి కొంతమంది యువ ఆటగాళ్లు వచ్చారు. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో కొత్త, పాత ప్లేయర్ల కలయికతో ఉన్న జట్టు ఇంగ్లిష్ జట్లును ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్‌ను మార్చింది. సోహమ్ దేశాయ్ స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్ లే రౌక్స్‌ను నియమించింది. ప్రస్తుతం ఆయన ఇంగ్లాండ్‌లో టీంమిండియా జట్టుతో కలిశారు. ఆటగాళ్లతో కసరత్తులు చేయిస్తున్నారు.
ఆటగాళ్ల స్ట్రెంత్ అండ్ కండీషనింగ్‌లో అడ్రియన్ లే రౌక్స్‌కు మంచి అనుభవం ఉంది. ఇతడు గతంలో భారత జట్టుకు సేవలందించారు. 2022 జనవరి నుంచి మే 2003 వరకు పనిచేశారు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఆరేళ్లపాటు కండీషనింగ్ కోచ్‌గా వ్యవహరించారు. రకాల వ్యాయామాలు చేయిస్తూ ఆటగాళ్ల పురోగతిని పర్యవేక్షించారు. న్యూట్రిషన్ గైడెన్స్ ఇస్తూ ప్లేయర్ల ఫిట్‌నెస్ మెరుగుపడేందుకు కృషిచేశారు. ఈ సీజన్‌లో పంజాబ్ ఫైనల్ వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి అతడికి భారత్ జట్టకు స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్‌గా అవకాశం దక్కింది.