Published On:

Sukhoi su-57: ఇండియాకు రష్యా ఆఫర్, అమ్మకానికి సుఖోయ్‌ -57

Sukhoi su-57: ఇండియాకు రష్యా ఆఫర్, అమ్మకానికి సుఖోయ్‌ -57

russia sukhoi su-57 offer to india: సుఖోయ్‌ -57 యుద్ధ విమానాలను ఇండియాకు విక్రయిస్తామంటూ ఆఫర్‌ చేస్తోంది రష్యా. మరి పుతిన్‌ సడెన్‌గా ఇండియాకు ఎందుకు ఈ యుద్ధ విమానాలు ఆఫర్‌ చేస్తున్నాడు. దీనికి కారణం … ఇటీవల కాలంలో రష్యా బాగా బలహీనపడిపోవడమే. వరుసగా గత నాలుగుసంవత్సరాల నుంచి ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్నాడు. ఈ యుద్ధంలో లక్షలాది మంది సైనికులను కోల్పోవడంతో పాటు బిలియన్‌ల కొద్ది డాలర్లు నష్టపోయాడు. బడ్జెట్‌లో 35 శాతం సైన్యానికి కేటాయించాడు. మరో వైపు అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు కఠినమైన ఆంక్షలు విధించడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో ఇండియాకు ఎస్‌యు -57 యుద్ధ విమానాలు విక్రయించి సొమ్ము చేసుకుందామనుకుంటున్నాడు. అయితే దీంట్లో భౌగోళిక రాజకీయాలు కూడా ఇమిడి ఉన్నాయి.

 

 

ఆపరేషన్‌ సిందూర్‌తో ఇండియా పాకిస్తాన్‌పై దాడి చేసి వారి ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసింది. వాస్తవానికి వారి ఎయిర్‌బేస్‌లు ధ్వంసం అయినట్లు వీడియోలు కూడా ప్రతి భారతీయుడు చూశాడు. పాక్‌కు తగిన గుణపాఠం చెప్పారని యావత్‌ దేశం మోదీ సర్కార్‌ను పొగడ్తలతో ముంచెత్తింది. అక్కడి వరకు ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. మరి పాకిస్తాన్‌ వాదన విషయానికి వస్తే ఇండియాకు చెందిన ఆరు యుద్ధ విమానాలను కూల్చివేశామని గొప్పగా చెబుతోంది. మరి ఇండియా వాదన ఏమిటంటే.. ఒక్కటంటే ఒక్క యుద్ధం విమానం కూలలేదని.. అందరం క్షేమంగా తిరిగి వచ్చాయని మన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ చెబుతోంది. మరి ఇండియాకు చెందిన చీఫ్‌ ఆఫ్‌ డీఫెన్స్‌ స్టాప్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ వాదన మాత్రం వేరుగా ఉంది. విమానాలు కోల్పోయామని అయితే అవి ఏంటని తెలియరాలేదు. చిన్నపాటి ద్వంసం జరిగిందని అది ఎక్కువ ఎఫెక్ట్ కాలేదని చౌహాన్ తెలిపారు. డిఫెన్స్ సిస్టమ్ ను మరింత దృడంగా చేయడానికి కేంద్రం రెడీ అయింది.

ఇవి కూడా చదవండి: