CSK vs MI: తడబడిన ముంబయి.. చెన్నై లక్ష్యం 158 పరుగులు
CSK vs MI: వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రోహిత్ సేన మెుదట బ్యాటింగ్ చేయనుంది.
ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ లో తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ముంబయి బ్యాటింగ్ లో ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్ రాణించారు. ముంబయికి మంచి ఆరంభం లభించిన ఉపయోగించుకోలేకపాయింది.
చెన్నై బౌలింగ్ లో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశాడు. సాంటార్న్, దేశ్ పాండే చెరో రెండు వికెట్లు తీసుకోగా.. మగాల ఒక వికెట్ పడగొట్టాడు.
LIVE NEWS & UPDATES
-
CSK vs MI: తడబడిన ముంబయి.. చెన్నై లక్ష్యం 158 పరుగులు
ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ లో తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ముంబయి బ్యాటింగ్ లో ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్ రాణించారు. ముంబయికి మంచి ఆరంభం లభించిన ఉపయోగించుకోలేకపాయింది.
చెన్నై బౌలింగ్ లో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశాడు. సాంటార్న్, దేశ్ పాండే చెరో రెండు వికెట్లు తీసుకోగా.. మగాల ఒక వికెట్ పడగొట్టాడు.
-
CSK vs MI: ఏడో వికెట్ డౌన్.. స్టబ్స్ క్యాచ్ ఔట్
ముంబయి ఏడో వికెట్ కోల్పోయింది. మగాల బౌలింగ్ స్టబ్స్ క్యాచ్ ఔట్ అయ్యాడు. బౌండరీ వద్ద గైక్వాడ్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. క్రీజులో డెవిడ్, షోకిన్ ఉన్నారు.
-
CSK vs MI: విజృంభిస్తున్న జడ్డూ.. ముంబయి ఆరో వికెట్ డౌన్
రవీంద్ర జడేజా తన బౌలింగ్ లో ముంబయికి చుక్కలు చూపిస్తున్నాడు. జడ్డూ బౌలింగ్ లో తిలక్ వర్మ ఎల్ బీడబ్యూ గా వెనుదిరిగాడు. దీంతో ముంబయి ఆరో వికెట్ కోల్పోయింది. వర్మ 18 బంతుల్లో 22 పరుగులు చేశాడు. స్టబ్స్ క్రీజులోకి వచ్చాడు.
-
CSK vs MI:10 ఓవర్లు.. ఐదు వికెట్లకు 84 పరుగులు
ముంబయి కష్టాల్లో పడింది. ఐదు వికెట్ల నష్టానికి 84 పరుగలు చేసింది. ప్రస్తుతం 10 ఓవర్లు పూర్తయ్యాయి.
-
CSK vs MI: ఐదో వికెట్ డౌన్.. అర్షద్ ఖాన్ ఔట్
ముంబయి ఐదో వికెట్ కోల్పోయింది. సాంటర్న్ బౌలింగ్ లో ఎల్బీడబ్యూ గా వెనుదిరిగాడు. అర్షద్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు.
-
CSK vs MI: వరుస వికెట్లు.. కష్టాల్లో ముంబయి జట్టు
ముంబయి వరుస వికెట్లు కోల్పోయింది. గ్రీన్ క్యాచ్ రవీంద్ర జడేజా అద్భుతంగా అందుకున్నాడు. ప్రస్తుతం ముంబయి.. 75 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. క్రీజులో అర్షద్, తిలక్ ఉన్నారు.
-
CSK vs MI: ముగిసిన పవర్ ప్లే.. 61 పరుగులు చేసిన ముంబయి
పవర్ ప్లే లో ముంబయి రెచ్చిపోయింది. వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. మగాల వేసిన ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. క్రీజులో కామెరున్ గ్రీన్, ఇషాన్ కిషాన్ ఉన్నారు.
-
CSK vs MI: తొలి వికెట్ కోల్పోయిన మంబయి.. రోహిత్ క్లీన్ బౌల్డ్
ముంబయి తొలి వికెట్ కోల్పోయింది. దేశ్ పాండే బౌలింగ్ లో రోహిత్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 38 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ 13 బంతుల్లో 21 పరుగులు చేశాడు.
-
CSK vs MI: ముగిసిన మూడో ఓవర్.. 30 పరుగులు
మూడు ఓవర్లు ముగిసేసరికి ముంబయి 30 పరుగులుచ చేసింది. ఈ ఓవర్లో మూడు ఫోర్లు వచ్చాయి.
-
CSK vs MI: రెండో ఓవర్.. కేవలం 6 పరుగులే చేసిన ముంబయి
రెండో ఓవర్లో ముంబయి 6 పరుగులు మాత్రమే చేసింది. దేశ్ పాండే కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.
-
CSK vs MI: తొలి ఓవర్.. 10 పరుగులు చేసిన ముంబయి
తొలి ఓవర్లో ముంబయి 10 పరుగులు చేసింది. దీపక్ చాహర్ వేసిన ఓవర్లో రోహిత్ రెండు ఫోర్లు కొట్టాడు.
-
CSK vs MI: ముంబై బ్యాటింగ్.. క్రీజులో ఇషాన్, రోహిత్
టాస్ ఓడి ముంబయి బ్యాటింగ్ కి దిగింది. క్రీజులోకి రోహిత్, ఇషాన్ వచ్చారు.