Published On:

IPL 2025: చెన్నై హాట్రిక్ ఓటమి.. కీలక మ్యాచ్‌లో ఢిల్లీ గ్రాండ్ విక్టరీ

IPL 2025: చెన్నై హాట్రిక్ ఓటమి.. కీలక మ్యాచ్‌లో ఢిల్లీ గ్రాండ్ విక్టరీ

Match IPL 2025, Delhi Capitals won by 25 runs: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో చెన్నైపై ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నైపై 29 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇది వరుసగా మూడో ఓటమి కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడో విజయం కావడం విశేషం. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలవగా.. ఆ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్  నిర్ణీత 20 ఓవర్లలో 183 పరుగులు చేసింది.

 

184 పరుగుల భారీ లక్ష్యం ముందు చెన్నై సూపర్ కింగ్స్ బోల్తాపడింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు రచిన్ రవీంద్ర(3), డేవాన్ కాన్వే(13) విఫలమవ్వగా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(5), శివమ్ దూబె(18), రవీంద్ర జడేజా(2)లు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల ధాటికి తొందరగానే పెవిలియన్ చేరారు. ఇక, విజయ్ శంకర్(69, 54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్)తో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివరలో ధోనీ(30, 26 బంతుల్లో ఫోర్, సిక్స్)ఆడినా అప్పటికే మ్యాచ్ చేజారింది. ఢిల్లీ బౌలర్లో విప్రాజ్ నిగమ్ రెండు వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్, ముకేశ్, కుల్ దీప్ తలో వికెట్ తీశారు.

 

అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ జేక్ ఫ్రేజర్(0)ను ఖలీల్ అహ్మద్ డకౌట్ చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అభిషేక్(33), మరో ఓపెనర్ రాహుల్(77) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడుతున్న అభిషేక్‌ను రవీంద్ర జడేజా పెవిలియన్ పంపించాడు. అలాగే క్రీజులో ఉన్నంత సేపు అక్షర్ పటేల్(21) మెరుపులు మెరిపించాడు. అహ్మద్ బౌలింగ్‌లో అక్షర్ ఔట్ కావడంతో 90 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత సమీర్ రజ్వి(20), స్లబ్స్(24) రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 183 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, మతీశా పతిరన తలో వికెట్ తీశారు.