Published On:

LSG Vs RCB Updates: నేడు లక్నో, బెంగళూరు కీలక పోరు.. గెలిచేదెవరో..?

LSG Vs RCB Updates: నేడు లక్నో, బెంగళూరు కీలక పోరు.. గెలిచేదెవరో..?

LSG Vs RCB Updates: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా నేడు లక్నో సూపర్ జైంట్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య కీలక పోరు జరగనుంది. ఈ సీజన్ లో చివరి ఆఖరి లీగ్ మ్యాచ్ నేడు జరగనుంది. నేడు జరిగే మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. క్వాలిఫయర్-1 బెర్త్ దక్కాలంటే నేటి మ్యాచ్ లో లక్నోపై బెంగళూరు గెలుపు తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం 8 విజయాయాలు సాధించి ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన బెంగళూరు 17 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. కాగా నిన్న ముంబైపై గెలిచిన పంజాబ్ టాప్ లోకి దూసుకెళ్లింది. అయితే నేటి మ్యాచ్ లో బెంగళూరు గెలిస్తే మంచి రన్ రేట్ కారణంగా టాప్ లో నిలవనుంది. దీంతో లక్నోపై నేటి మ్యాచ్ లో బెంగళూరు తప్పక గెలవాల్సి ఉంది.

 

మరోవైపు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన లక్నో జట్టు విజయంతో సీజన్ ను ముగించాలని ప్రయత్నిస్తోంది. లక్నో కూడా బెంగళూరు జట్టుకు గట్టి పోటీ ఇవ్వనుంది. గత రెండు మ్యాచ్ ల్లో లక్నో జట్టు 200 పైగా స్కోర్ చేసింది. నేటి మ్యాచ్ లో కూడా తొలుత బ్యాటింగ్ చేస్తే మాత్రం ఆ జట్టు 200 పైగా పరుగులు చేస్తే జట్టు విజయానికి ఢోకా ఉండదు. ముఖ్యంగా లక్నో ఓపెనర్లు మిచెల్ మార్ష్, మార్క్రమ్, నికోలస్ పూరన్ ఫామ్ లో ఉన్నారు. బౌలంగ్ లో రూర్కే, అవేశ్ ఖాన్ రాణిస్తున్నారు. నేటి మ్యాచ్ లో ప్లేయర్లంతా సమష్టిగా రాణిస్తే లక్నో గెలుపు తథ్యమనే చెప్పొచ్చు.

 

లక్నో సూపర్ జైంట్స్:

రిషబ్ పంత్ (కెప్టెన్), మర్క్రమ్, మిచెల్ మార్ష్, పూరన్, ఆయుశ్ బదోని, సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్, అవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్, విల్ రూర్కే.

 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

రజత్ పాటీదార్ (కెప్టెన్), సాల్ట్, కోహ్లీ, మయాంక్, జితేశ్, రొమారియో షెఫర్డ్, కృనాల్, టిమ్ డేవిడ్, భువనేశ్వర్, యశ్ దయాళ్, ఎంగిడి