Published On:

PBKS vs RCB: Qualifier 1: పంజాబ్ పై బెంగళూరు విజయం

PBKS vs RCB: Qualifier 1: పంజాబ్ పై బెంగళూరు విజయం

Qualifier 1 : ipl 2025 : PBKS vs RCB:      పంజాబ్ నిర్థేశించిన  101లక్ష్యాన్ని బెంగళూరు సునాయాసంగా గెలిచింది. రెండు వికెట్ల నష్టానికి 106పరుగులు చేసి విజయఢంకా మోగించింది.  ఓపెనర్లు సాల్ట్ 27 బంతుల్లో 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ 12 బంతులకు 12 పరుగులు చేసి వెనుదిరిగాడు. మయాంక్ అగర్వాల్ 13బంతుల్లో 19పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రజత్ పాటిదార్ 8బంతుల్లో 15పరుగులు చేయగా విజయం లభించింది. మొదటి ఇన్నింగ్స్ లో బెంగళూరు బౌలర్లు నిప్పులు చెరగగా రెండవ ఇన్నింగ్స్ లో పంజాబ్ బౌలర్లు మాత్రం నీరుగారిపోయారు. పంజాబ్ బౌలర్లలో జెమిసన్, ముషీర్ చెరో వికెట్ తీసుకున్నారు. బెంగళూరుకు విజయం నల్లేరు మీద నడక అయింది.

 

 

మొదటి ఇన్నింగ్స్ లో బెంగళూరు బౌలర్లు నిప్పులు చెరిగారు. వీరి ధాటికి పంజాబ్ బ్యాటింగ్ లైనపై పేకమేడలా కూలిపోయింది. యష్ దయాల్, భువనేశ్వర్, ఓపెనర్లను పడగొట్టగా… హజల్ వుడ్, సుయాంష్ మిడిల్ ఆర్డర్ ను కుప్పకూల్చారు. వంద పరుగులే కష్టమనుకున్న దశలో ఆమ్ రాజీ 12 బంతులకు 18పరుగులు చేశాడు.

 

 

 

యష్ దయాల్ వేసిన మొదటి ఓవర్ రెండో బంతికి ఆర్యను పెవిలియన్ కు చేర్చాడు. ఆర్మ 5 బంతుల్లో 7 పరుగులు చేశాడు. భువనేశ్వర్ వేసిన రెండవ ఓవర్ చివరి బంతికి పి.సింగ్ ను ఔట్ చేశాడు. ఇతను 10బంతుల్లో 18పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ తక్కువ స్కోరుకే ఓపెనర్లను కోల్పోయింది. హెజల్ వుడ్ వేసిన మొదటి ఓవర్ నాలుగవ బంతికి శ్రేయస్ ను ఔట్ చేశాడు. ఇతను 3 బంతులాడి 2 పరుగులు చేశాడు. ఆతర్వాత వచ్చిన నేహాల్ వధేరా 10బంతుల్లో 8పరుగులు చేసి దయాల్ కు చిక్కాడు. మార్కస్ 17బంతుల్లో 26పరుగులు చేసి సుయాష్ శర్మ బాల్ కు బౌల్డ్ అయ్యాడు. ఆతర్వాత వచ్చిన శషాంక్ సింగ్ సుయాంష్ శర్మ బాల్ కే బౌల్డ్ అయ్యాడు. ఇతను 5బంతుల్లో 3 పరుగులు చేశాడు. ముషీర్ ఖాన్ సుయాంష్ శర్మ బౌల్ కు ఎల్బీగా డక్ అవుట్ అయ్యాడు.

 

 

బెంగళూరు బౌళర్లలో హజల్ వుడ్ 3.1 ఓవర్లు వేసి 21పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. సుయాష్ శర్మ మూడు వికెట్లకు 17పరుగులు ఇచ్చి 3వికెట్లు తీశాడు. యష్ దయాల్ 4 ఓవర్లు వేసి 26పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ 2 ఓవర్లు వేసి ఒక వికెట్ పడగొట్టాడు. షెపర్డ్ 1ఓవర్ వేసి 5పరుగులు ఇచ్చి 1వికెట్ తీశారు.

 

 

ఇవి కూడా చదవండి: