IPL 2025: నేడు క్వాలిఫయర్-1 మ్యాచ్.. ఫైనల్ బెర్త్ ఎవరిదో?

Qualifier-1: ఐపీఎల్ సీజన్ తుది అంకానికి చేరుకుంది. పదేళ్ల తర్వాత ప్లే ఆఫ్స్ కు చేరిన పంజాబ్ కు బెంగళూరు రూపంలో కీలక సవాల్ ఎదురుకానుంది. కాగా లీగ్ దశలో పంజాబ్, బెంగళూరు సమవుజ్జీలుగా కనిపిస్తున్న వేళ.. ఇవాళ జరిగే క్వాలిఫయర్-1 మ్యాచ్ కు రెడీ అయ్యాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకోనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 మ్యాచ్ లో పోరాడనుంది.
కాగా నేటి మ్యాచ్ లో ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ మంచి ఆరంభాన్ని ఇస్తున్నారు. ఇంగ్లిస్, అయ్యర్, నేహల్ వధేరా మిడిలార్డర్ లో అండగా ఉంటున్నారు. శశాంక్ సింగ్, స్టొయినిస్ ఫినిషర్లుగా అదరగొడుతున్నారు. బౌలింగ్ లో అర్ష్ దీప్, హర్ ప్రీత్ బ్రార్ అండగా నిలుస్తున్నారు. సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ స్వదేశానికి తిరిగి వెళ్లడంతో అతడి స్థానంలో ఒమర్జాయ్ కు తుదిజట్టులో ప్లేస్ దక్కొచ్చు. గాయం నుంచి కోలుకున్న లెగ్ స్నిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఈ మ్యాచ్ లో ఆడే ఛాన్సుంది.
మరోవైపు సుదీర్ఘ కాలం తర్వాత ఆర్సీబీ టాప్-2 లో నిలిచింది. లీగ్ దశలో అదిరే ప్రదర్శన చేసిన బెంగళూరు.. ఆఖరి మ్యాచ్ లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన జోష్ లో ఉంది. ఓపెనర్లు సాల్ట్, కోహ్లీ మంచి ఆరంభాన్ని ఇస్తుండగా.. మిడిలార్డర్ లో తాత్కాలిక కెప్టెన్ జితేశ్ శర్మ ప్రదర్శన కీలకంగా మారింది. గాయపడిన టీమ్ డేవిడ్ సెలక్షన్ కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇక హాజల్ వుడ్ ఫిట్ నెస్ సాధించడంతో బౌలింగ్ బలం పెరిగింది. పేసర్ భువనేశ్వర్ కుమార్ తోపాటు స్పిన్నర్లు క్రునాల్ పాండ్యా, సుయాష్ శర్మ జట్టుకు ఉపయోగపడుతున్నారు. ఇదే పిచ్ పై జరిగిన ఓ మ్యాచ్ లో పంజాబ్ పై గెలవడం బెంగళూరుకు కలిసొచ్చి అంశం.
పంజాబ్ కింగ్స్:
ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్, జోష్ ఇంగ్లిస్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నేహల్ వధేరా, శశాంక్ సింగ్, స్టొయినిస్, ఒమర్జాయ్, హర్ ప్రీత్ బ్రార్, కైల్ జేమిసన్, అర్ష్ దీప్ సింగ్, చాహల్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
కోహ్లీ, సాల్ట్, మయాంక్ అగర్వాల్, రజత్ పటీదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ, క్రునాల్ పాండ్యా, లివింగ్ స్టోన్, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్, యష్ దయాళ్, హాజెల్ వుడ్, సుయాష్ శర్మ.