IPL 2025: రాహుల్ మెరుపు ఇన్నింగ్స్.. చెన్నై ఎదుట భారీ లక్ష్యం

Chennai Super Kings vs Delhi Capitals Match in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్ రాహుల్(77, 55 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్(33), స్టబ్స్(24), అక్షర్ పటేల్(21), సమీర్ రిజ్వీ(20) రాణించగా.. జాక్ ఫ్రేజర్(0), అశుతోష్ శర్మ(1) విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, పతిరన తలో వికెట్ తీశారు.