Iran- Israel: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భయం భయం.. ట్రంప్ కీలక ఆదేశాలు
Donald Trump: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయాందోళన చెందుతున్నారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేయబోతుందని ఇప్పటికే అమెరికా హై అలర్ట్ ప్రకటించింది. ఇరాన్, ఇరాక్ లో ఉన్న తమ వారంతా ఖాళీ చేయాలని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. కాగా పశ్చిమాసియా ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమని.. తక్షణమే ఖాళీ చేయాలని సూచించారు. దీంతో ఇరాన్ లో ఏదో జరగబోతుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి.
ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ పక్కా ప్రణాళిక రచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్ దాడి చేయొచ్చని వార్తలు వస్తున్నాయి. ఇరాన్ పై దాడికి ఇజ్రాయెల్ రెడీగా ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇటీవలే ట్రంప్ పశ్చిమాసియాలో పర్యటించారు. ఆ సమయంలో ఇజ్రాయెల్ కు ప్రాధాన్యత ఇవ్వలేదని సమాచారం. అప్పటి నుంచి ట్రంప్ తో నెతన్యాహుకు విభేదాలు తలెత్తినట్టు కనిపిస్తోంది. పైగా ఇరాన్ తో అణు ఒప్పందం కూడా ఇజ్రాయెల్ కు రచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరాన్ పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధపడుతున్నట్టు అమెరికాకు సమచారం అందడంతో.. నేతన్యాహుతో ట్రంప్ ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తోంది. దాడుల ప్లాన్ పక్కకు పెట్టాలని డ్రంప్ కోరినా నేతన్యాహు నిరాకరించారని తెలుస్తోంది.