Last Updated:

Pawan Kalyan: జ్యోతిబాపూలే, అంబేద్కర్‌లతో వైఎస్ సమానం కాలేరు.. పవన్ కళ్యాణ్

జ్యోతిబాపూలే, అంబేద్కర్ ,సాహు మహరాజ్ లతో వైఎస్ సమానం కాలేరని పవన్ కళ్యాణ్ అన్నారు.నేను ఇక్కడికి వచ్చేటపుడు జ్యోతిబాపూలే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖద్వారం అని చూసాను.

Pawan Kalyan: జ్యోతిబాపూలే, అంబేద్కర్‌లతో వైఎస్ సమానం కాలేరు.. పవన్ కళ్యాణ్

Pawan Kalyan: జ్యోతిబాపూలే, అంబేద్కర్ ,సాహు మహరాజ్ లతో వైఎస్ సమానం కాలేరని పవన్ కళ్యాణ్ అన్నారు.

నేను ఇక్కడికి వచ్చేటపుడు జ్యోతిబాపూలే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖద్వారం అని చూసాను.

వారితో వైఎస్ కు పోలికా?.. పవన్ కళ్యాణ్

జ్యోతిబాపూలే, అంబేద్కర్ ,సాహు మహరాజ్ లతో వైఎస్ సమానం కాలేరు.

వైెఎస్ మంచి పనులు చేసారని గౌరవిస్తాము కాని మహానుభావులతో సమానంగా చూడలేమని పవన్ అన్నారు.

ఏ పథకాలు అయితే ఆగిపోయాయో ఆ పధకాలు మరలా పునరుద్దరిస్తాం.

గత ఏడాది 3400 మంది రైతులు చనిపోయారు. ఎక్కువగా దళిత, గిరిజన రైతులు ఉన్నారు.

బీమా సొమ్ములో కూడా కమీషన్లే.. పవన్ కళ్యాణ్

ఒక రైతు చనిపోతే 7 లక్షలు ఇవ్వాలి. అందులో కూడా రెండుమూడు లక్షలు కొట్టేస్తున్నారు.

మనలో మనం సంస్కరించబడకుండా మనం ఎదగలేం. నేను ప్రధానమంత్రిని కలిస్తే మేము సన్నిహితం అని వైసీపీ నేతలు చెప్పుకుంటారు.

జనసేన బీజేపీతో ఉంటుందని మీరు సఫర్ అవకూడదు. మీకు ఏమీ జరక్కపోతే అపుడు అడగండి.

సకలశాఖల మంత్రి చెప్పినదానినే చెప్పాలే తప్ప ఎటువంటి అధికారం లేదని పరోక్షంగా ఏపీ హోం మంత్రి పై పవన్(Pawan Kalyan) సెటైర్లు వేసారు.

 ఏపీలో  కులవివక్ష ఎక్కువ.. పవన్

ఏపీలో  కులవివక్ష ఎక్కువ ఉందని.. దానికి కారణం జగన్ ప్రభుత్వమే అని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు.

వివక్షకు గురయ్యే కులాలను అర్ధం చేసుకోవాలని.. ఒకరిద్దరు చేసిన తప్పులకు కులాలను తప్పుపట్టడం మంచిది కాదని పవన్ అన్నారు.

ఒక్కరు చేసిన తప్పుకు కూలాలను సాకు చూపకూడదని.. ఆ సామాజిక వర్గంలో అందరు అలాంటి వాళ్లు కాదని పవన్ తెలిపారు.

కుల వివక్ష పోయినపుడే రాష్ట్రం అభివృద్ధి.. పవన్ కళ్యాణ్

కుల వివక్ష పోయినపుడే రాష్ట్రం అభివృద్ధి బాటలో సాగుతుందని అన్నారు.

బడుగు బలహీన వర్గాల్లో ఐక్యత రావాలని పవన్ పిలుపునిచ్చారు. ఐక్యత సాధించినపుడే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని పవన్ అన్నారు.

రాష్ట్రంలో కులాలను వేరు చేసే వైసీపీ పాలనను తరిమికొట్టాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

తాము అధికారంలోకి వస్తే కుల వివక్షతకు తావు లేకుండా చేస్తామని తెలిపారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/