Pawan Kalyan on SC ST Subplan: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలే జనసేన లక్ష్యం- పవన్ కళ్యాణ్
SC ST Subplan: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు నిర్లక్ష్యంపై మంగళగిరిలో జనసేన సదస్సు జరిగింది. అధికారంలోకి వస్తే.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సంక్షేమానికి కృషి చేస్తామంటూ జనసేన డిక్లరేషన్ ప్రకటించింది. వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మూలన పడిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ శాశ్వతంగా అమలయ్యేలా చూడాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
SC ST Subplan: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు నిర్లక్ష్యంపై మంగళగిరిలో జనసేన సదస్సు జరిగింది. అధికారంలోకి వస్తే.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సంక్షేమానికి కృషి చేస్తామంటూ జనసేన డిక్లరేషన్ ప్రకటించింది. వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మూలన పడిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ శాశ్వతంగా అమలయ్యేలా చూడాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
ఏపీలో గిరిజనులకు తీరని అన్యాయం జరుగుతుందని.. పవన్ వైసీపీ పై విమర్శలు చేశారు.
మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
నవరత్నాల పేరుతో ఏపీలో దళితులకు భవిష్యత్ లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.
ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన నిధులో కోసం ప్రశ్నించాలని జనసేన అధినేత పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 27 ఎస్సీ, ఎస్టీ పథకాలు రద్దు చేశారని.. దళితులకు విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేశారని తెలిపారు.
రాష్ట్రంలో సబ్ ప్లాన్ అమలు చేయని జగన్ పై.. ఎన్ని కేసులు పెట్టాలన్నారు. సదస్సులో పాల్గొన్న జనసేన నేతలు.. జగన్ పోవాలి.. పవన్ రావాలి అంటూ నినాదాలు చేశారు.
పవన్ దెబ్బకు భయపడి జగన్ కొత్త జీవోలు తెస్తున్నారని విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సహా ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ఉంటామని పవన్ Pawan Kalyan హామీ ఇచ్చారు.
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే ఎవరు ఆందోళన చేయలేదని అన్నారు. అలాంటిది కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడానికి గల వివరణ ఇవ్వాలని కోరారు.
కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టి.. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని పవన్ మండిపడ్డారు.
నేను మీ వాడిని అని నేను చెప్పనక్కర్లేదని.. పని తీరు నచ్చి.. మీరే నన్ను అక్కున చేర్చుకోవాలని పవన్ తెలిపారు.
ఎమ్మెల్యేలు.. మంత్రులు సబ్ ప్లాన్ గురించి ఎందుకు మాట్లాడరని పవన్ ప్రశ్నించారు.
ప్రభుత్వ పథకాలను పేదలకు దూరం చేస్తున్న వైసీపీ పాలనను అంతం చేయాలని ఈ సందర్భంగా పవన్ పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/