Last Updated:

Nara Lokesh: మంగళగిరిలో ప్రజా దర్బార్ నిర్వహించిన నారా లోకేశ్

ఏపీ మంత్రి నారా లోకేశ్ బాధ్యతలు తీసుకున్న వెంటనే చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గమైన మంగళ గిరి ప్రజల కోసం ప్రజాదర్బార్ నిర్వహించారు .మంగళగిరి ప్రజల సమస్యలు తెలుసుకోడానికి ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారు

Nara Lokesh: మంగళగిరిలో ప్రజా దర్బార్ నిర్వహించిన  నారా లోకేశ్

Nara Lokesh:ఏపీ మంత్రి నారా లోకేశ్ బాధ్యతలు తీసుకున్న వెంటనే చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గమైన మంగళ గిరి ప్రజల కోసం ప్రజాదర్బార్ నిర్వహించారు .మంగళగిరి ప్రజల సమస్యలు తెలుసుకోడానికి ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారు మంత్రి నారా లోకేశ్. దింతో ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పిన నారా లోకేష్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు .గతంలో చాలా మంది ప్రజా దర్బార్ నిర్వహించారు .కానీ అధికారం చేపట్టిన వెంటనే లోకేష్ ప్రజా దర్భార్ నిర్వహించడం నియోజకవర్గ ప్రజల్లో ఆసక్తి కర చర్చగా మారింది .

 అనుభవం నేర్పిన పాఠాలతో ముందుకు..(Nara Lokesh)

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేశానన్నారు . గత అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్ధవంతంగా పని చేస్తానని చెప్పారు. యువగళం పాదయాత్రలో కేజీ నుండి పీజీ వరకూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని హామీ ఇచ్చాను అని దానికి అనుగుణంగానే చర్యలు తీసుకుంటానని తెలిపారు. స్టాన్‌ఫోర్డ్ లో చదువుకున్న నాకు గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే అవకాశాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నానన్నారు . ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తెచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తానునని ప్రకటించారు.

 

 

ఇవి కూడా చదవండి: