Janasena chief Pawan Kalyan: పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మీడియాకు అండగా ఉండి వారి కష్టాల్లో పాలుపంచుకుంటామని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ వెంట జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు, మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారు.
Janasena chief Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మీడియాకు అండగా ఉండి వారి కష్టాల్లో పాలుపంచుకుంటామని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ వెంట జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు, మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారు.
భారీ ర్యాలీగా ..(Janasena chief Pawan Kalyan)
అంతకుముందు చేబ్రోలులోని తన నివాసం నుంచి పవన్ భారీ ర్యాలీగా బయల్దేరారు. పవన్ జాతీయ జెండా పట్టుకుని ప్రజలకు అభివాదం చేస్తుండగా ర్యాలీ ముందుకు సాగింది.ఈ ర్యాలీ చేబ్రోలు నుంచి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పట్టణంలోకి ప్రవేశించింది. పశువుల సంత, ఆర్టీసీ కాంప్లెక్స్ , చర్చి సెంటర్, ఉప్పాడ సెంటర్, పాతబస్టాండు, అంబేద్కర్ సెంటర్. ప్రభుత్వాసుపత్రి సెంటర్ మీదుగా పాదగయ క్షేత్రం నుంచి స్దానిక ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ రిటర్నింగ్ అధికారికి పవన్ కళ్యాణ్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. జనసేన కార్యకర్తలు, ఆయన అభిమానులు ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు.