Last Updated:

Janasena Yuvasakthi : 25 కేజీల బియ్యం ఇవ్వడానికి నేను రాలేదు.. మీకు 25 ఏళ్ల భవిష్యత్ ఇవ్వడానికే జనసేన

శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనవరి 12న జరగనున్న ‘వాయిస్ ఆఫ్ యూత్’ కోసం ఎదురుచూస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను పవన్ కల్యాణ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

Janasena Yuvasakthi : 25 కేజీల బియ్యం ఇవ్వడానికి నేను రాలేదు.. మీకు 25 ఏళ్ల భవిష్యత్ ఇవ్వడానికే జనసేన

Janasena Yuvasakthi :  శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనవరి 12న జరగనున్న ‘వాయిస్ ఆఫ్ యూత్’ కోసం ఎదురుచూస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను పవన్ కల్యాణ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. జనసేన యువశక్తి .. మన యువత.. మన భవిత అంటూ ట్విట్టర్లో పవన్ పోస్ట్ చేశారు. దిక్కులు పిక్కటిళ్లేలా జనసేన సమక్షంలో నీ గళం వినిపించు.. అంటూ పిలుపునిచ్చారు.’’25 కేజీల బియ్యం ఇవ్వడానికి నేను రాలేదు.. మీకు 25 ఏళ్ల భవిష్యత్ ఇవ్వడానికి జనసేన ఉంది‘‘ అంటూ పవన్ కల్యాణ్ వీడియోలో వ్యాఖ్యానించారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచకపు పాలనను ఎండగట్టేలా యువత గళం విప్పాలని జనసేన పిలుపునిస్తోంది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో అధికార వైస్పార్ కాంగ్రెస్ పార్టీని బలంగా ఢీ కొట్టేందుకు జనసేన రెడీ అవుతోంది. అందుకు తగ్గట్టు గానే వరుస కార్యక్రమాలతో జన సైనికుల్లో జోష్‌ నింపుతున్నారు పవన్ కల్యాణ్. ఒకవైపు ప్రజావాణి, కౌలు రైతు భరోసా యాత్రలు నిర్వహిస్తూనే తాజాగా “యువశక్తి ” కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

 

ఈ మేరకు రణస్థలంలో ‘యువశక్తి’తో తడాఖా చూపుదాం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర యువతను ఒకేచోటకు తీసుకొచ్చేలా, ఉత్తరాంధ్ర సమస్యలపై గళమెత్తేలా, సంస్కృతి, సంప్రదాయం, సాహిత్యం ప్రపంచానికి చాటిచెప్పేలా జనసేన పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని నేతలు చెబుతున్నారు. ఇటీవలే ఈ సభకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పవన్ కల్యాణ్ తో పాటు 100 మంది యువతీయువకులు వేదిక పంచుకోనున్నారు.

అదేవిధంగా యువతకు జనసేన పార్టీ తరుపున ఓ మంచి అవకాశాన్ని ఇస్తున్నారు. సామాన్య యువతీ, యువకులు వేదిక నుంచి మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. దీనిలో పాల్గొనేందుకు జనవరి 8వ తేదీలోపు యువతీ యువకులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. మీ పేరు, వివరాలు నమోదు చేయాల్సిన ఫోన్ నంబరు 08069932222, ఈ– మెయిల్ vrwithjspk@janasenaparty.org కు ఏ అంశం మీద మాట్లాడాలి అనుకుంటున్నారో క్లుప్తంగా వాయిస్ రికార్డు చేసి జనసేనాని సమక్షంలో మీ గలాన్ని వినిపించవచ్చు.

ఇవి కూడా చదవండి…

Pawan Kalyan : వైసీపీ ఓడిపోతోంది.. జగన్‌కు కూడా ఆ విషయం తెలుసు : పవన్ కళ్యాణ్

Ap stampede issues : కందుకూరు, గుంటూరు తొక్కిసలాటలపై విచారణ కమిటీ..

Pawan kalyan : లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ కూడా మా పనేనా.. ఇంక పోలీసులు ఎందుకు ? : పవన్ కళ్యాణ్

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

ఇవి కూడా చదవండి: