Last Updated:

Ap stampede issues : కందుకూరు, గుంటూరు తొక్కిసలాటలపై విచారణ కమిటీ..

టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు, గుంటూరు లో నిర్వహించిన సభల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలను ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

Ap stampede issues : కందుకూరు, గుంటూరు తొక్కిసలాటలపై  విచారణ కమిటీ..

Ap stampede issues:  టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు, గుంటూరు లో నిర్వహించిన సభల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలను ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వీటిపై ఏపి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బి శేష శయన రెడ్డి నేతృత్వంలో విచారణ కమిటీని నియమించింది. కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్డు లో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి చెందగా, గుంటూరులో చీరల పంపిణీలో జరిగిన ఘటనలో ముగ్గురు మహిళలు చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనలపై జస్టిస్ శేషశయన రెడ్డి విచారించనున్నది. ఘటనపై కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

కందుకూరు, గుంటూరు తొక్కిసలాటలు, ఆ పరిస్థితులకు దారి తీసిన కారణాలు ఏంటి ? బాధ్యులెవరు అన్న అంశాలపై కమిషన్ విచారణ చేస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. సభల నిర్వహణలో సరైన ఏర్పాట్లు చేశారా లేదా ? ప్రభుత్వం ఇచ్చిన అనుమతులని ఉల్లంఘించారా ? ఒక వేళ ఉల్లంఘిస్తే అందుకు బాధ్యులెవరు అనే అంశాలను కమిషన్ తేలుస్తుందని వెల్లడించింది. అలాగే.. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా వ్యవస్థీకృతంగా తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సిన విధానాలపై ప్రతిపాదనలు ఇస్తుందని .. ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి విచారణను నెల రోజుల్లో ముగించి కమిషన్ నివేదిక సమర్పిస్తుందని వెల్లడించింది.

 

పై రెండు ఘటనల నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ పార్టీల రోడ్ షోలు, ర్యాలీలు, రోడ్లపై సభలపై ఆంక్షలు విధిస్తూ.. ప్రభుత్వం జీవో నెంబర్ 1 జారీ చేసింది. ఈ ఉత్తర్వులు దుమారం రేపాయి. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఆంక్షల అమలులో భాగంగా.. ఏపీ పోలీసులు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుప్పం పర్యటనపై నోటీసులు ఇచ్చారు. బాబు కుప్పం పర్యటనను అడ్డుకున్నారు. ప్రచార రథాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు… సభల నిర్వహణలో వైఎస్సార్సీపీకి ఒక రూలు..మాకో రూలా అని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి…

వైసీపీ సమావేశంలో రచ్చ.. కార్యకర్తలకు భోజనం పెట్టమన్న నాయకుడిని గెంటేశారు

 మంత్రి అప్పలరాజుకు జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఓపెన్ ఛాలెంజ్.. ఏంటంటే..?

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

 

ఇవి కూడా చదవండి: