Published On:

Pawan Kalyan’s Son Injured: అగ్ని ప్రమాదంలో గాయపడ్డ పవన్ చిన్న కుమారుడు.. సింగపూర్‌ వెళ్లనున్న డిప్యూటీ సీఎం పవన్!

Pawan Kalyan’s Son Injured: అగ్ని ప్రమాదంలో గాయపడ్డ పవన్ చిన్న కుమారుడు.. సింగపూర్‌ వెళ్లనున్న డిప్యూటీ సీఎం పవన్!

Pawan Kalyan’s Son injured in fire at Singapore School: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన రద్దు అయింది. అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం పవన్ అరకు ఏజెన్సీలో పర్యటిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ కుమారుడు అగ్నిప్రమాదంలో గాయపడ్డారు. దీంతో కొడుకుకు సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పవన్ కల్యాణ్ తన విశాఖ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇవాళ సాయంత్రం తన అరకు పర్యటనను పూర్తి చేసుకొని విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నేరుగా సింగపూర్‌లో చికిత్స తీసుకుంటున్న తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ వద్దకు వెళ్లనున్నారు.

 

సింగపూర్ పాఠశాలలో అగ్నిప్రమాదం..
డిప్యూటీ సీఎం పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ చదువుతున్న పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తన కొడుకు మార్క్ శంకర్ చిక్కుకున్నారు. దీంతో అతడి కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. దట్టమైన పొగ కారణంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. తోటి విద్యార్థులతో పాటు పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం శంకర్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన సమాచారం అందకపోయినప్పటికీ పవన్ హుటాహుటిన సింగపూర్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఏజెన్సీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇవాళ తన పర్యటన అనంతరం పవన్ సింగపూర్ వెళ్లనున్నారు.

ఇవి కూడా చదవండి: