Published On:

Motorola Razr 60 Launch: మోటో మడత ఫోన్.. మోస్ట్ పవర్‌ఫుల్.. ఫీచర్స్ కేక

Motorola Razr 60 Launch: మోటో మడత ఫోన్.. మోస్ట్ పవర్‌ఫుల్.. ఫీచర్స్ కేక

Motorola Razr 60 Launch in Indian Market: చౌకైన ఫోల్డబుల్ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటరోలా భారతదేశంలో Razr 60 ను విడుదల చేసింది. గొప్ప ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో వచ్చే మోటరోలా రేజర్ 60 మంచి ఫ్లిప్ ఫోన్‌గా చెబుతున్నారు. ఇది జూన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వస్తుంది. మోటరోలా రేజర్ 60 ధర, సేల్ తేదీ, కెమెరా, బ్యాటరీ ఇతర ఫీచర్ల గురించి ముందుగా తెలుసుకుందాం.

 

Motorola Razr 60 Price

మోటరోలా రేజర్ 60 భారతదేశంలో 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో విడుదలైంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ ధర రూ.49,999. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మూడు కలర్, ఫినిష్ ఎంపికలతో పరిచయం చేశారు. పాంటోన్ లైటెస్ట్ స్కై కలర్ ఆప్షన్ మార్బుల్ ఫినిషింగ్ కలిగి ఉంది. కాగా, పాంటోన్ జిబ్రాల్టర్ సీ రంగు పాంటోన్ స్ప్రింగ్ బడ్ షేడ్ కలర్‌లో ఫాబ్రిక్ ఫినిష్, వీగన్ లెదర్ రియర్ ప్యానెల్ ఫినిష్‌తో ఉంటుంది.

 

Motorola Razr 60 Sale Date

మోటరోలా రేజర్ 60 మొదటి సేల్ జూన్ 4 బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది. ఈ ఫోన్‌ను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు. మోటో రేజర్ 60 ఫోన్ ఫ్లిప్‌కార్ట్, మోటరోలా ఇండియా వెబ్‌సైట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ఎంపిక చేసిన రిటైల్ దుకాణాల్లో అమ్మకానికి ఉంటుంది.

 

Motorola Razr 60 Specifications

మోటరోలా రేజర్ 60లో 6.9-అంగుళాల pOLED మెయిన్ డిస్‌ప్లే ఉంది. అయితే, దీని కవర్ డిస్‌ప్లే 3.6-అంగుళాల pOLED. బయట స్క్రీన్ ప్రొటక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉంది. ఈ ఫ్లిప్ ఫోన్ దుమ్ము, నీటి నుండి రక్షణ కోసం IP48 రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో శక్తివంతమైన డైమెన్సిటీ 7400X చిప్‌సెట్ ప్రాసెసర్‌ ఉంది, ఇది ఫోన్ వినియోగాన్ని మరింత మెరుగ్గా చేయడంలో సహాయపడుతుంది.

 

Moto Razr 60 Camea And Battery

కెమెరా గురించి మాట్లాడుకుంటే, మోటరోలా రేజర్ 60 50 మెగాపిక్సెల్స్, 13 మెగాపిక్సెల్‌తో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం దీని ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4500 mAh బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌తో 30W టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంది.