Last Updated:

Pawan Kalyan: క్రిమినల్ రాజకీయ నాయకులంటే నాకు అసహ్యం.. పవన్ కల్యాణ్

ప్రజలు బాద్యతగా ఉండాలి, బాగా చదువుకోవాలి, పన్నులు కట్టాలి అనుకొంటాను. క్రిమినల్స్ గా వ్యవహరించే రాజకీయ నాయకులంటే నాకు అసహ్యం. రాష్ట్రాన్ని క్రిమినల్ చేత పాలింపపడకూడదు అనుకొంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

Pawan Kalyan: క్రిమినల్ రాజకీయ నాయకులంటే నాకు అసహ్యం.. పవన్ కల్యాణ్

Andhra Pradesh: ప్రజలు బాద్యతగా ఉండాలి, బాగా చదువుకోవాలి, పన్నులు కట్టాలి అనుకొంటాను. క్రిమినల్స్ గా వ్యవహరించే రాజకీయ నాయకులంటే నాకు అసహ్యం. రాష్ట్రాన్ని క్రిమినల్ చేత పాలింపపడకూడదు అనుకొంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. వైజాగ్ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ ను ప్రభుత్వం నిర్భందించింది. ఈ క్రమంలో ఆయన న్యాయ పోరాటానికి సిద్ధమైనారు. దీంతో విజయవాడ మంగళగిరికి చేరుకొన్నారు. మీడియా సమావేశంలో పవన్ మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

జనవాణి కార్యక్రమంలో భాగంగానే నా పర్యటన సాగింది. చిత్తూరు తర్వాత విశాఖపట్నంలో జనవాణి చేపట్టాము. మూడు రోజుల ముందుగానే మేము వైజాగ్ టిక్కెట్లు బుక్ చేసుకొన్నాము. అమరావతి రాజధానిపై ఎవ్వరూ మాట్లాడకూడదు అనేది వైసిపి ఎత్తుగడ. దిగజారుడు రాజకీయాలు చేసేది వైసిపినే. అధికారం లేన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు మరో మాట, ఇది వైకాపా తీరుగా రాజధాని నుద్ధేశించి పేర్కొన్నారు.

3 రాజధానులపై ప్రజల నుండి స్పందన కరువౌడంతో నా పర్యటన పై వైకాపా నేతలు దృష్టి పెట్టారు. వైజాగ్ లో మేము లా అండ్ ఆర్డర్ తప్పలేదు. ప్రభుత్వమే లా అండ్ ఆర్డర్ సీన్ క్రియేట్ చేసింది. అధికార పార్టీ వారు నోరు తెరిస్తే బూతులు, దాడులు, ఇంటిళ్ల పాదిని తిట్టేయడం వారికే చెల్లింది. ఓ పొలిటికల్ పార్టీగా బలమైన సామాజిక బాధ్యతలు ఉన్నవాళ్లం. వైజాగ్ లో నాకు వచ్చిన ప్రజాబలం చూసి ఓర్వలేక ఇదంతా చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో మా పార్టీకి మంచి ఆధరణ ఉందన్నారు. విశాఖ గర్జన అంట, ప్రభుత్వంలో ఉంటూ కూతలు పెట్టడం ఏంటి? నిస్సహాయలు, అధికారానికి దూరంగా ఉన్న వారు గర్జించేది. అది కూడా తెలయని పాలనను నేడు మనం చూస్తున్నాం.

వైకాపా శ్రేణులు కవ్వింపులు చేస్తే, ఎవరైనా ఊరుకుంటారా? నినాదాలు చేస్తారు. అదే సమయంలో పోలీసులు వైకాపా వారికి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వలేదు. అంటే వారే దాడులు చేసుకొని వాటిని జనసేన పార్టీపై తోసేందుకే ఈ నాటకమంతా. పోలీసులు ఎవరిని అరెస్ట్ చేశారో తెలుసా? ఎయిర్ పోర్టు అధారిటి కోసం పర్మిషన్ పెట్టుకొన్న ఆ 14మంది పైనా హత్యానేరం కింద కేసులు పెట్టేది అని అన్నారు. భారతదేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి కేసులు పెట్టలేదు. వారందరికి జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు.

ప్రతిపక్షాలు ఏ కార్యక్రమం చేసినా అన్ని సెక్షన్లు వారికి వర్తించేలా పోలీసులు కేసులు పెడుతున్నారు. అదే వైకాపా వారు చేపడితే వారిపై కేసులు ఉండవు. ఇదేనా పాలన అంటే అని పవన్ నిలదీశారు. రూపా అనే జనసేన ఆడబిడ్డను హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబు. నా పర్యటనలో పెట్రేగిపోయిన ఉన్నతస్థాయి అధికారి నాతో గొడవ పెట్టుకొన్నారు. మీరు కదలొద్దంటారు. ముందుకు పోయేందుకు ఒప్పుకోము అంటారు. నన్నే వెళ్లే కార్యకర్తలను కర్రలతో దూరం జరపమంటారా అని ఓ దశలో అధికారిని ప్రశ్నిస్తే, అతని నుండి మౌనమే సమాధానం వచ్చింది. పదే పదే ఆ సమయంలో ఆ అధికారికి ఫోన్ వచ్చింది. మాట్లాడుతున్నాను సర్ అంటూ వారితో అంటున్నాడు. ఏంటి ఈ ప్రభుత్వం తీరంటూ పవన్ మండిపడ్డారు.

వైసిపి ఉద్ధేశం ఒక్కటే, నన్ను జైల్లో పెట్టడమే వాళ్ల ప్లాన్. నన్ను ఎంత రెచ్చగొట్టినా భరిస్తా, లక్షలాది మంది అభిమానం ఉన్నా నేను ప్రజాప్రతినిధి కాదు గదా అందుకే సామాన్యుడి లాగా వ్యవహరించాను, సగటు మనిషిలాగానే ప్రవర్తించాను. నా భధ్రతా సిబ్బందిని బెదిరించారు. ఏపీ పోలీసు మీద నమ్మకం లేదనుకొన్న వ్యక్తి సీఎం జగన్ కు ఐపిఎస్ లు సెల్యూట్ చేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది.

నా జనసేన సైనికుల పట్ల జైల్లో అసభ్యపదంగా వ్యవహరించారు. ఓ జైలరు వారిని బెల్టుతో కొట్టారు. మోకాళ్లపైన కూర్చో బెట్టి నడిపించారు. గడ్డాలు తీయించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వైసిపి నాయకులకు ఒకటే చెబుతున్నా, విజయనగరం, అనకాపల్లి నేతలు పేదల భూములను కబ్జా చేశారు. అవి ఎక్కడా జనవాణి కార్యక్రమంలో బయట పడతాయని జనసేన పార్టీ చేపట్టిన జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకొన్నారు. అయినా కూడా 310 అర్జీలు మా నేతలకు ప్రజలు సమస్యల రూపంలో చెప్పుకొచ్చారని పవన్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Union Minister Kishan Reddy: ఏపికి ఒక్కటే రాజధాని.. అది కూడా అమరావతే.. స్పష్టం చేసిన కేంద్ర మంత్రి

ఇవి కూడా చదవండి: