Published On:

International Yoga Day 2025: యోగాంధ్రకు స్పెషల్ బస్సులు

International Yoga Day 2025: యోగాంధ్రకు స్పెషల్ బస్సులు

Minister Narayana On Yogandhra: రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ ముస్తాబైంది. కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. యోగాంధ్ర కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలిరానున్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ప్రజలకు రవాణా, పార్కింగ్, వసతుల సౌకర్యంపై మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. దాదాపు 5 లక్షల మందితో రేపు విశాఖలో యోగాభ్యాసం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో దూర ప్రాంతాల వారు ఇవాళే విశాఖకు చేరుకుంటున్నారు. వారికి వసతులు కల్పించే అంశంపై మంత్రి నారాయణ మాట్లాడారు.

 

కార్యక్రమానికి ప్రజలు భారీగా హాజరుకానున్న నేపథ్యంలో ప్రభుత్వం మొత్తం 7295 బస్సులు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. బస్సులు పార్కింగ్ చేయడం, అలాగే కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలపై చర్చించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాగా వేడుకల కోసం 12 వేల మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాలతోపాటు, 30 డ్రోన్ లను సైతం నిఘా కోసం ఏర్పాటు చేశామని చెప్పారు.