Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్!

Hari Hara Veera Mallu Movie Release Date Confirmed: టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిమర వీరమల్లు’ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ మూవీని జులై 24వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈనెల 12న విడుదల కావాల్సిన ఈ మూవీ పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఇక, ఈ సినిమాకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించగా.. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. కాగా, అంతకుముందు ఈ సినిమాను క్రిష్ తెరకెక్కించారు. ఈ మూవీలో అనుపమ్ ఖేర్, సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. పవన్ కల్యాణ్ చారిత్రక యోధుడి పాత్రలో కనిపించనున్నారు.
ఈ మూవీ పీరియాడికల్ యాక్షన్ తరహాలో తెరకెక్కుతుండగా.. ఫస్ట్ పార్ట్ ‘హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరట్’తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అంతకుముందు ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఈ మూవీలోని ‘అసుర హననం’ సాంగ్‌లో ఉన్న ఫైట్స్‌ను పవన్ కల్యాణ్ స్పెషల్‌గా డిజైన్ చేశారని డైరెక్టర్ జ్యోతికృష్ణ తెలిపారు.