Published On:

TTD: టీటీడీ ఉద్యోగులకు హెల్మెట్లు.!

TTD: టీటీడీ ఉద్యోగులకు హెల్మెట్లు.!

Helmets To TTD Employees: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు టీటీడీ ఉద్యోగులకు హెల్మెట్లను అందజేశారు. 10 వేల హెల్మెట్లను టీటీడీ ఉద్యోగులకు అందిస్తామని, నేడు 2 వేల హెల్మెట్లను అందించినట్లు ఆయన తెలిపారు. స్పాన్సర్ల సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. వచ్చే దశలో 7 వేల 5 వందల హెల్మెట్లను ఇస్తామని టీటీడీ చైర్మన్ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనల అనుసారం అందరూ హెల్మెట్లను ధరించాలని ఆయన కోరారు.

 

టీటీడీ ఉద్యోగులకి హెల్మెట్లను అందించినందుకు బి.ఆర్ నాయుడుకి, దాతలకి టీటీడీ చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని కోరారు. తిరుమల మొదటి, రెండో ఘాట్ రోడ్లలో హెల్మెట్లు ధరించే విధంగా అవగాహన కార్యక్రమాలు కూడా టీటీడీ విజిలెన్స్ నిర్వహిస్తోందని టీటీడీ చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ తెలిపారు.

ఇవి కూడా చదవండి: