Home / Visakhapatnam
Breaking News: విశాఖపట్నం గండిగుండంలోని ఐటీసీ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ గోదాంలో లో ఎక్కువగా సిగరెట్లు, బింగో ప్యాకెట్లు ఉన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి 8 పైర్ ఇంజన్ లు చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ప్రమాదానికి గల కారణాలను ఆరాతీస్తున్నారు. ఎంత ఆస్తినష్టం జరిగిందని ఇంకా తెలియరాలేదు. అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరుగలేదని తెలుస్తోంది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు అనుమానిస్తు్నారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. […]
Visakhapatnam court: ఆరుగురిని నరికి చంపిన అప్పలరాజుకు విశాఖ కోర్టు మరణశిక్ష విధించింది. 2021 ఏప్రిల్ 15వ తేదీన విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో చిన్నారితోపాటు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని అప్పలరాజు హత్యచేశాడు. జుత్తాడలోని బత్తిన, బొమ్మిడి కుటుంబాల మధ్య వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బొమ్మిడి కుటుంబం ఇంట్లోకి చొరబడిన అప్పలరాజు ఆరుగురిపై కత్తితో దాడి చేశాడు. దొరికిన వారిని దొరికినట్టు నరికిపారేశాడు. హంతకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో […]
Lady Jump into Well with Children in Visakhapatnam: విశాఖ జిల్లా పెందుర్తిలో తీవ్ర విషాద ఘటన జరిగింది. సత్యవాణిపాలెం గ్రామంలో కుటుంబ కలహాలతో ఓ మహిళ.. కూతురు, కుమారుడితో కలిసి బావిలో దూకింది. ఘటనలో తల్లి, కుమారుడు మృతిచెందారు. కుమార్తె ప్రాణాలతో బయటపడింది. విషయం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే భర్త వేధింపులే ఇందుకు కారణమని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యవాణిపాలెం గ్రామానికి […]
Minister Narayana On Yogandhra: రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ ముస్తాబైంది. కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. యోగాంధ్ర కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలిరానున్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ప్రజలకు రవాణా, పార్కింగ్, వసతుల సౌకర్యంపై మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. దాదాపు 5 లక్షల మందితో రేపు విశాఖలో యోగాభ్యాసం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో దూర ప్రాంతాల వారు ఇవాళే విశాఖకు చేరుకుంటున్నారు. వారికి వసతులు […]
PM Modi Arrive To Visakhapatanam Today: ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఏపీకి రానున్నారు. ఢిల్లీ నుంచి ఇవాళ భువనేశ్వర్ కు ప్రత్యేక విమానంలో రానున్నారు. అక్కడి నుంచి సాయంత్రం విశాఖకు చేరుకుంటారు. నేరుగా ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్ కు వెళ్తారు. రాత్రికి ఈస్ట్ నేవీ గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు. కాగా ప్రధాని మోదీకి.. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలకనున్నారు. […]
International Yoga Day 2025 in Visakhapatnam: అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం విశాఖ రెడీ అవుతోంది. ఈ మేరకు యోగాంధ్ర 2025 వేడుకులకు ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. గిన్నీస్ బుక్ సహా 22 రికార్డుల్లో నమోదు అయ్యేలా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు యోగాభ్యాసంలో 3.5 లక్షల మంది పాల్గొననున్నారు. మొత్తం 5 లక్షల మందితో ఇంటర్నేషనల్ యోగా డే జరగనుంది. కాగా యోగా డే వేడుకలకు ప్రధాని […]
CM Chandrababu Visits Visakhapatnam Today: ఏపీ సీఎం చంద్రబాబు నేడు విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి.. 11 గంటలకు విశాఖ చేరుకుంటారు. అనంతరం బీచ్ రోడ్డులోని కాళీమాత గుడి వద్దకు చేరుకుని.. పార్క్ హోటల్ వరకు అంతర్జాతీయ యోగా వేడుకలకు సంబంధించి ప్రధాన వేదికల వద్ద ఏర్పాట్లను సీఎం పరిశీలిస్తారు. అనంతరం 11.45 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానానికి చేరుకుని యోగా దినోత్సవ ఏర్పాట్లను […]
PM Modi Visits Vizag on International Yoga Day: ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 21న విశాఖ వేదికగా జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 20న సాయంత్రం భువనేశ్వర్ నుంచి విశాఖకు ప్రధాని చేరుకోనున్నారు. తూర్పు నావికాదళం గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు. ఈనెల 21న ఉదయం 6.30 గంటల నుంచి 7.45 గంటల వరకు […]
BreakingNews: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జూన్ 10న విశాఖ రానున్నారు. బీచ్ రోడ్లో జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన వివరాలను విశాఖ కలెక్టరేట్‌కు అధికారులు పంపించారు. జూన్ 10న ఉదయం పదకొండున్నర గంటలకు ద్రౌపదీ ముర్ము ప్రత్యేక విమానంలో డిల్లీ నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్తారు. అక్కడ జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం […]
AP: జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సంబంధించి.. నేటి నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు నిచ్చారు. నెలరోజులపాటు యోగాంధ్ర 2025 నిర్వహిస్తామని జూన్ 21న విశాఖ బీచ్ లో ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. కాగా అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి సీఎం చంద్రబాబు నేడు సచివాలయంలో […]