International Yoga Day 2025: రేపే అంతర్జాతీయ యోగా డే.. ముస్తాబైన విశాఖ!
International Yoga Day 2025 in Visakhapatnam: అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం విశాఖ రెడీ అవుతోంది. ఈ మేరకు యోగాంధ్ర 2025 వేడుకులకు ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. గిన్నీస్ బుక్ సహా 22 రికార్డుల్లో నమోదు అయ్యేలా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు యోగాభ్యాసంలో 3.5 లక్షల మంది పాల్గొననున్నారు. మొత్తం 5 లక్షల మందితో ఇంటర్నేషనల్ యోగా డే జరగనుంది. కాగా యోగా డే వేడుకలకు ప్రధాని మోదీ రానుండటంతో విశాఖ యోగా డే డిక్లరేషన్ ను ఏపీ ప్రకటించనుంది.
కాగా యోగాంధ్ర 2025ని పురస్కరించుకుని నగరంలో కోలాహలం నెలకొంది. ఎల్లుండి జరిగే ఇంటర్నేషనల్ యోగా డే కు సన్నాహకంగా ఆర్కే బీచ్ లో వాక్ థాన్ ఉత్సాహంగా జరిగింది. ఏయూ కన్వెన్షన్ సెంటర్ నుంచి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్, ఎస్ సవిత సహా ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు పాల్గొన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటి కృష్ణబాబు, ప్రభుత్వ కార్యదర్శి సురేష్ కుమార్, కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, పలువురు అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎల్లుండి విశాఖకు రానున్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ యోగా డే వేడుకల్లో పాల్గొగనున్నారు. యోగాంధ్ర 2025 కోసం ప్రధాన వేదికగా ఆర్కే బీచ్ ను ఎంపిక చేశారు. లక్షల మంది వేడుకల్లో పాల్గొననున్నారు. యోగా దినోత్సవం రోజు ఉదయం 5.30 గంటల నుంచి ప్రజలను వేదిక వద్దకు అనుమతిస్తారు. ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు ప్రధాని మోదీ యోగా కార్యక్రమాల్లో పాల్గొంటారు.