Dengue Effect In Monsoon: దోమల ద్వారా సంక్రమించే డెంగ్యూతో ఎలా రక్షించుకోవాలో తెలుసుకోండి.!

Reduce dengue effect in monsoon: వర్షాకాలంలో కుంటలు నిండి దోమలు చెలరేగుతాయి. ఈ దోమల వలన చాలా రకాల రోగాలు వస్తాయి. అందులో ముఖ్యమైనది జ్వరం. అందులో డెంగ్యూ అనేది చాలా ప్రమాదం. ఇలాంటిది దోమల ద్వారా సంక్రమిస్తుంది. తాజాగా రుతుపవనాలు రావడంతో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో అనేక ప్రాంతాలలో డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయి. డెంగ్యూ అనేది దోమల నుండి ప్రజలకు వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రపంచ జనాభాలో సగం మంది ఇప్పుడు డెంగ్యూ ప్రమాదంలో ఉన్నారు, ప్రతి సంవత్సరం 100–400 మిలియన్ల ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయని అంచనా.
నివేదికల ప్రకారం, కర్ణాటకలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. మైసూర్ లో 290 అనుమానిత కేసులలో 10 డెంగ్యూ కేసులు నిర్ధారించబడ్డాయి. మైసూరు గ్రామీణ ప్రాంతాల్లో తొమ్మిది పాజిటివ్ చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. కోల్‌కతాలోని డమ్ డమ్‌కు చెందిన 13 ఏళ్ల బాలిక శనివారం డెంగ్యూతో మరణించింది. కోల్‌కతాలో రుతుపవనాలు అధికారికంగా వచ్చిన నాలుగు రోజుల తర్వాత ఇది జరిగింది.
డెంగ్యూ బారిన పడిన చాలా మందికి లక్షణాలు ఉండవు. కానీ అలా సోకిన వారికి, అత్యంత సాధారణ లక్షణాలు అధిక జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, వికారం మరియు దద్దుర్లు ఉంటాయి. చాలా మందికి 1-2 వారాలలో డెంగ్యూ తగ్గుతుంది. కొంతమందికి మాత్రం తీవ్రమవుతుంది, వీరికి చికిత్స అవసరం. జబ్బు తీవ్రమైతే డెంగ్యూ ప్రాణాంతకం కావచ్చు. డెంగ్యూ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం ముఖ్యం. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇక్కడ కొన్ని మార్గాలను నిపుణులు అందిస్తున్నారు.
దోమలతో జాగ్రత్తగా ఉండండి, వాటిని నివారించండి.
పగటి పూట కుట్టే దోమల ద్వారా డెంగ్యూ వ్యాపిస్తుందని నిపుణులు తెలిపారు. దోమ కాటు ప్రమాదాన్ని తగ్గించుకునేందుకు నివారణోపాయాలను తీసుకోవాలి. ఇందుకు దోమ తెరలను వాడాలి. ఇందుకు పొడవాటి చొక్కాలు పొడవాటి ప్యాంటులు ధరించాలి. బయట ఉన్నప్పుడు లేత రంగు దుస్తులు మంచివట, ఇవి తక్కువ దోమలను ఆకర్షిస్తాయి.
దోమతెరలు తప్పనిసరి ఉపయోగించాలి. ఇవి దోమలను ఇంట్లోకి రాకుండా నిరోధిస్తాయి. కిటికీలకు తలుపులకు తెరలను ఏర్పాటు చేసుకోవాలి.
ఇంటి చుట్టు నిలిచి ఉన్న నీటిని తొలగించాలి. ఈ నీటిలోనే దోమలు సంతానోత్పత్తిని జరుపుతాయి. పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. చెత్తను ఇంటికి దూరంగా పారవేయాలి.